పగటి వేళను ఆస్వాదించడం మానేస్తే ప్రమాదంలో పడ్డట్లే..! జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా తగ్గుతాయ్..!

by Javid Pasha |   (  Updated:2025-07-03 07:32:48  IST  )

పగటి వేళను ఆస్వాదించడం మానేస్తే ప్రమాదంలో పడ్డట్లే..! జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా తగ్గుతాయ్..!

పగటి వేళను ఆస్వాదించడం మానేస్తే ప్రమాదంలో పడ్డట్లే..! జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా తగ్గుతాయ్..!
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతి సిద్ధంగా నడుచుకోవడం, ప్రకృతిని అనుసరించడం, ఆస్వాదించడం సహజ సిద్ధమైన మానవ లక్షణాలుగా నిపుణులు పేర్కొంటారు. సైంటిఫిక్‌గా రుజువైన కొన్ని సరిస్థితుల్లో తప్ప, మిగతా విషయాల్లో ప్రకృతి విరుద్ధమైన చర్యలు, అలవాట్లు మానవాళిని ప్రమాదంలో పడేస్తాయి. అలాంటి వాటిలో పగటి సమయాన్ని ఆస్వాదించకపోవడం, సహజమైన కాంతికి, సూర్యరశ్మికి బహిర్గతం కాకపోవడం కూడా ఒకటి అని ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది. దీర్ఘకాలంపాటు పగటి వేళకు(Light exposure habits) బహిర్గతమయ్యే అలవాటును మానేస్తే గనుక మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వెల్లడించింది. ఎందుకలా జరుగుతుంది? ఇంకా ఏయే ప్రాబ్లమ్స్ తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

పగటివేళ వెలువడే సహజమైన కాంతికి బహిర్గతమయ్యే అలవాట్లు ఆరోగ్యాన్ని, మెదడు సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తాజా అధ్యయనం కనుగొన్నది. ఇందులో భాగంగా 300 మంది రోజువారీ అలవాట్లను పరిశోధకులు విశ్లేషించారు. సహజ కాంతి, కృత్రిమ కాంతి, రాత్రిపూట స్క్రీన్ ఉపయోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న పరిశోధకులు మానసిక స్థితిని, మెదడు సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని ఎలా ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు సహజ కాంతికి బహిర్గతం కావడం మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, సిర్కాడియన్ రిథమ్‌లలో సానుకూల మార్పులకు దారితీసినట్లు గుర్తించారు.

సహజ సిద్ధమైన కాంతికి గురికావడం నిద్ర, శక్తి, మానసిక స్థిరత్వాన్ని నియంత్రించే అంతర్గత గడియారంలో సానుకూల మార్పులకు దోహదం చేసినట్లు కూడా పరిశోధకులు గుర్తించారు. ఇది మానవ శరీరంలో, 24 గంటల కాలచక్రంతో (With the body's 24-hour cycle) మెదడు రసాయన క్రియలను సమన్వయం చేయడంలో సహాయపడింది(Helped synchronize brain chemical reactions). ఈ పరిస్థితి మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, అలసటను, నిద్రలేమిని, మానసిక రుగ్మతలను దూరం చేయడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాలను మెరుగు పరిచినట్లు రీసెర్చర్స్ నిర్ధారించారు. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచిందని తెలిపారు. అందుకే 24 గంటలుగా ఉండే రోజులో రాత్రింబవళ్లు వంటి ప్రకృతి పరిణామాలను, పరిస్థితులను తప్పక ఆస్వాదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పగటివేళ వెలుతురును, పరిసరాలను ఆస్వాదించడం మానేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

LINK

Next Story