- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూరపు సంబంధాల్లో టెక్ట్స్ మెసేజ్‌లే ఎమోషనల్ బ్రిడ్జ్..! ఏ విధంగా అంటే..
దగ్గర సంబంధాలకంటే.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్‌లో టెక్ట్స్ మెసేజ్‌లు ఎక్కవ సంతృప్తిని ఇస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

దిశ, ఫీచర్స్ : వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కేవలం ప్రత్యక్ష సంభాషణలే కాకుండా అనేక రూపాల్లో ఉంటుంది. అలాంటి వాటిలో టెక్ట్స్ లేదా మెసేజ్ చేయడం కూడా ఒకటి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మొదలుకొని రోజువారీ జీవితంలోని అనుభవాలను, ఆలోచనలను, ఆసక్తులను, అభిప్రాయాలను వాట్సాప్ ద్వారానో, మరేదైనా సోషల్ మీడియా వేదికగానో పంచుకునేవారు చాలామంది ఉంటారు. అయితే సంబంధాల విషయానికి వస్తే ఇవి అందరికీ ఒకేలా నచ్చుతాయని, ఒకే విధమైన ప్రభావం చూపుతాయని చెప్పలేం. పరిస్థితులను బట్టి వాటిపై ఆసక్తులు, వాటివల్ల ప్రయోజనాలు మారుతుంటాయి? ముఖ్యంగా రోజువారీ టెక్ట్స్ మెసేజ్‌లు లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్ (LDRs)లో సంతృప్తిని పెంచుతాయని 18 నుంచి 25 సంవత్సరాలలోపు వయసుగల 647 మందిపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్‌లో.. అంటే ప్రేమికులు లేదా భార్య భర్తలు ఉద్యోగాల పరంగానో, మరేదైనా కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లోనో, దేశాల్లోనో, గ్రామాల్లోనో ఉన్నప్పుడు టెక్ట్స్ మెసేజ్‌లు, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి వారిలో సంతృప్తిని ఇస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఈ టెక్ట్సింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ రెస్పాన్సివ్‌నెస్ దూరపు సంబంధాల మధ్య సంతృప్తిని బాగా పెంచుతుండగా.. భౌగోళికంగా సమీపంలో ఉన్న సంబంధాల్లో(GCRs)అంత ప్రభావం చూపవు. ఎందుకలా అంటే.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్‌లో టెక్ట్స్ మెసేజ్‌లు భాగస్వామికి రోజువారీ జీవితంలో భాగమనే భావనను కలిగిస్తాయి. ఫిజికల్ డిస్టెన్స్‌ను ఎమోషనల్ సాన్నిహిత్యంతో పూరిస్తాయి. ఉదాహరణకు భోజనం ఏం తిన్నారు? లేదా పని సమయంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేయడం వంటివి సంబంధాన్ని బలపరుస్తాయి. ఇక భౌగోళికంగా దగ్గరి సంబంధాల్లో (GCR) టెక్ట్సింగ్ సంభాషణల సంతృప్తి స్థాయిలు ఎందుకు తక్కువ అంటే.. వారు ముఖాముఖి సంభాషణలు, కలిసి భోజనం చేయడం లేదా సమయం గడపడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.






