సిమెంటు వాడకుండానే ఇండ్ల నిర్మాణం..! ఏ విధంగా అంటే..

by Javid Pasha |

పెట్టి ఇల్లు కడితే ఏం లాభం అనిపిస్తుంది కదా ? అలాంటి ప్రశ్నలోంచి పుట్టిందే ‘స్టూడియో ఫర్ ఎర్తెన్ ఆర్కిటెక్చర్’. ఇది సహజ పదార్థాలతో ఆరోగ్యకరమైన ఇంటిని నిర్మించే వెంచర్.

సిమెంటు వాడకుండానే ఇండ్ల నిర్మాణం..! ఏ విధంగా అంటే..
X

దిశ, ఫీచర్స్ : మధ్యాహ్నం ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొస్తే.. బయటకన్నా ఇంట్లోనే ఎక్కువ వేడిగా ఉంటుంది. అప్పుడేమనిపిస్తుంటది.? ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కడితే ఏం లాభం అనిపిస్తుంది కదా ? అలాంటి ప్రశ్నలోంచి పుట్టిందే ‘స్టూడియో ఫర్ ఎర్తెన్ ఆర్కిటెక్చర్’. ఇది సహజ పదార్థాలతో ఆరోగ్యకరమైన ఇంటిని నిర్మించే వెంచర్. ‘స్టూడియో ఫర్ ఎర్తెన్ ఆర్కిటెక్చర్’ ఓనర్ కృతికా వెంకటేశ్. నిర్మాణ రంగంలో ప్రజల మధ్య ఉన్న దూరాన్ని బొగ్గుగనిలో చూసినప్పుడు కలిగిన ఆలోచనలోంచి పుట్టిందే ‘స్టూడియో ఫర్ ఎర్తెన్ ఆర్కిటెక్చర్’. ఎంతైనా చెప్పండి.. మన ఇల్లు ప్రకృతి అనుకూలంగా లేకపోతే అది మనకు మేలు చేస్తుందా ?

లారీ బేకరీతో స్ఫూర్తి

కృతికా స్థాపించిన ‘స్టూడియో ఫర్ ఎర్తెన్ ఆర్కిటెక్చర్’ కేవలం ఇండ్లు నిర్మించడానికే కాకుండా.. లివింగ్ రూమ్స్‌ను శ్వాసించేలా తీర్చిదిద్దడం కూడా తన బాధ్యతగా తీసుకుంది. ఇల్లు అంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండి.. అందంగా కనిపించాలనేది ఆమె ఆలోచన. చెన్నయ్‌లోని మొహమ్మద్ సార్థక్ ఏజీ ఆర్కిటెక్చర్ అకాడమీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమెకు లారీ బేకరీ అనే పేరు తెలిసింది. కేరళలో సామాన్య ప్రజల కోసం తక్కువ ఖర్చుతో.. స్థానికంగా దొరికే పదార్థాలతో ఇండ్లు కట్టిన గాంధేయవాది ఆయన. అక్కడ ఉన్నన్ని రోజుల్లో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో ఆమెకు స్పష్టమయ్యింది. అప్పటి నుంచి ప్రాజెక్టుల్లో మట్టిని.. పలుచని ఇసుకను.. వాడబడిన ముడిసరుకులను వినియోగిస్తూ ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంది.

సంప్రదాయ నిర్మాణం

డిజర్టేషన్ కోసం కృతిక తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్‌లోని మైనింగ్ ప్రాంతాలను సందర్శించినప్పుడు అక్కడి నరకంలాంటి వాతావరణాన్ని చూసింది. సంప్రదాయ నిర్మాణాలవైపు మరింతగా ఆకర్షితురాలైంది. ఒక చదరపు అడుగు గ్రానైట్ రూ.300కి కొంటాం. కానీ దానికోసం భూమిని ఎంతగా తవ్వాల్సి వస్తుందో ? ప్రకృతిని ఎంతగా నాశనం చేస్తున్నామో ఆలోచించం. ఒక్కో సిమెంట్ బ్యాగ్ తయారీకి కనీసం 25 లీటర్ల తాజా నీరు వాడతాం. 500 చదరపు అడుగు గదిని నిర్మించడానికి ఎంతలేదన్న ఒక టన్ను సిమెంట్ వాడితే.. అంతే మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వెళ్తుంది. దీనివల్ల ఇంటి నిర్మాణ సమయంలో వాతావరణం ఎంతమేర కలుషితమైతుందో అర్థం చేసుకోవచ్చు.

స్వచ్ఛమైన గాలి

కృతిక ఐఐటీ మద్రాస్‌తో కలిసి 2020లో చెన్నయ్‌లోని ఒక ఇంట్లో గాలి నాణ్యతను పరిశీలించినప్పుడు షాకయ్యింది. అపార్ట్‌మెంట్లలో వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ స్థాయిలు బాగా ఎక్కువగా ఉండేవి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’కు నిదర్శనం. ఆ పరిణామాల కంటే మెరుగైన పరిష్కారం ఆమె ఎంచుకుంది. మట్టి.. గోమయం.. సున్నం వంటి పదార్థాలతో గోడలు చెక్కుతూ ఆవిరి ఏర్పడని అటముడి పలకతో గదులను డిజైన్ చేసింది. వీటి ద్వారా స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. ఎప్పుడూ చల్లగా.. హాయిగొల్పేలా ఉంటుంది. గదులు కూడా ప్రకృతి సమ్మతంగా మనోహరంగా ఉంటాయి.

భవిష్యత్ మార్గం

ఇంటి నిర్మాణానికి కృతిక సిమెంటుకు బదులు సున్నం వాడుతోంది. ఇది ఇంటిని బలంగానూ.. ప్రకృతి సిద్ధంగానూ ఉంచుతుంది. పాత రోజుల్లో ఈ సిమెంటు ఎక్కడిది ? కాబట్టి ఒకరకంగా ఇంటి నిర్మాణంలో పాత పద్ధతులను అనుసరించి సంప్రదాయాన్ని కాపాడవచ్చు అని చెప్తోంది కృతిక. ఇండ్లను మాత్రమే నిర్మించడం లేదు భూమిని గౌరవించి జీవన విధానాన్ని నిర్మిస్తోంది. ఖర్చు ఎక్కువవుతుందని పూర్తిగా సస్టెయినబుల్ హౌజ్ కట్టలేకపోయినా ఒక్కో మట్టిగోడ, ఒక సున్నపు ప్లాస్టర్ వాడటంతో దీనిని మొదలుపెట్టవచ్చు. ఈ మట్టిగదులు కాంక్రీట్ ఇండ్లలా కాకుండా నిజంగా ఓ శ్వాసను పీల్చే విధంగా ఉంటాయి. తాను నిర్మించిన ఇంట్లో తన చిన్నారి పాపతో నివసిస్తూ ప్రకృతి సౌమ్యత్వంలో.. భవిష్యత్ పర్యావరణహితమై నిర్మాణానికి మార్గం చూపిస్తోంది.

Next Story