మొబైల్ ఫోన్‌ను చెవికి ఆనించి మాట్లాడుతున్నారా? బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు..!

by Javid Pasha |   (  Updated:2025-12-02 09:56:27  IST  )

చెవికి దగ్గరగా, తల భాగంలో ఫోన్‌ను ఎక్కువసేపు ఉంచి మాట్లాడటం వల్ల దాని నుంచి వెలువడేరేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ (RF radiation) మెదడు కణాలపై ప్రభావం చూపి, దీర్ఘకాలంలో బ్రెయిన్ ట్యూమర్ డెవలప్ అయ్యేందుకు దారితీస్తుంది.

మొబైల్ ఫోన్‌ను చెవికి ఆనించి మాట్లాడుతున్నారా? బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు..!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతీ ఒక్కరు మొబైల్‌ఫోన్‌ వాడుతున్నారు. కొందరైతే గంటల తరబడి మాట్లాడుతుంటారు. అయితే ఇలా చేయడం మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 15 నిమిషాలు చెవికి దగ్గరగా పెట్టుకొని ఫోన్ మాట్లాడేవారిలో పదేండ్ల తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆంకాలజీ (International Journal of Oncology)లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇయర్‌ఫోన్ లేదా హెడ్‌ఫోన్ వాడితే ఈ రిస్క్ అంత ఉండకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

చెవికి దగ్గరగా, తల భాగంలో ఫోన్‌ను ఎక్కువసేపు ఉంచి మాట్లాడటం వల్ల దాని నుంచి వెలువడేరేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ (RF radiation) మెదడు కణాలపై ప్రభావం చూపి, దీర్ఘకాలంలో బ్రెయిన్ ట్యూమర్ డెవలప్ అయ్యేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా గ్లియోమా (glioma), అలాగే అకౌస్టిక్ న్యూరోమా (acoustic neuroma) అనే రెండు రకాల మెదడు కణితులు దీర్ఘకాలిక ఫోన్ వాడకంతో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో నిపుణులు పరిశీలించినప్పుడు రోజుకు 15 నిమిషాలకు పైగా ఫోన్‌ను తలకు ఆనించి మాట్లాడినవారిలో, అలా మాట్లాడని వారితో పోలిస్తే గ్లియోమో, అకౌస్టిక్ న్యూరోమా కణాలు చాలా ఎక్కువగా కనిపించాయి. మొబైల్ ఫోన్‌ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ (RF radiation) ఇందుకు కారణమని రీసెర్చర్స్ అంటున్నారు. కాబట్టి హెడ్‌ఫోన్స్, స్పీకర్ ఫోన్ లేదా ఇయర్‌ఫోన్స్ వాడటం, ఫోన్‌ను తలకు అడ్డం పెట్టకుండా, చెవి దగ్గరగా పెట్టుకొని గంటల తరబడి మాట్లాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. రెండు మూడు నిమిషాలకంటే ఎక్కువసేపు మాట్లాడకపోవడం మంచిదని, ఒకవేళ ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంటే 5 నిమిషాలకోసారి కట్ చేసి కాసేపు గ్యాప్ ఇచ్చి మాట్లాడాలని సూచిస్తున్నారు.

వివిధ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

*Interphone Study (2010) : ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో జరిగిన అతిపెద్ద అధ్యయనం ఇది. రోజుకి 30 నిమిషాలు, 10 సంవత్సరాలకు పైగా ఫోన్ చెవికి అడ్డం పెట్టి మాట్లాడిన వారిలో గ్లియోమా రిస్క్ 40% పెరిగింది.

*Hardell గ్రూప్ అధ్యయనాలు (స్వీడన్, 1997-2019) : బలమైన రేడియేషన్ ఉన్న పాత 2G/3G ఫోన్లు వాడిన వారిలో గ్లియోమా రిస్క్ 3 రెట్లు, అకౌస్టిక్ న్యూరోమా రిస్క్ 3 నుంచి 5 రెట్లు పెరిగింది.

*CERENAT Study (ఫ్రాన్స్, 2014) – ఎక్కువగా ఫోన్ వాడే వారిలో గ్లియోమా, మెనింజియోమా రిస్క్ 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా కనిపించింది.

*Million Women Study (బ్రిటన్, 2019) – ఎలాంటి రిస్క్ పెరగలేదని చెప్పింది (కానీ ఈ అధ్యయనంలో సగటు ఫోన్ వాడకం చాలా తక్కువ – రోజుకి కొన్ని నిమిషాలు మాత్రమే).

*డెన్మార్క్ కోహర్ట్ స్టడీ (2020) – రిస్క్ పెరగలేదని చెప్పింది (కానీ డేటా మొబైల్ కంపెనీల నుంచి తీసుకున్నారు. ఎవరు ఎంతసేపు చెవికి అడ్డం పెట్టి మాట్లాడారో కచ్చితంగా తెలియదు).

*Ramazzini Institute Study (ఇటలీ, 2018) – చాలా తక్కువ మోతాదు రేడియేషన్‌తోనే ఎలుకల్లో హృదయ ష్వాన్నోమా కనిపించింది.

*COSMOS Study (2025 వరకు ప్రిలిమినరీ ఫలితాలు) : 2.5 లక్షల మందిపై 10+ సంవత్సరాలు జరుగుతున్న అతిపెద్ద ఆధునిక అధ్యయనం. ఇప్పటివరకు గ్లియోమా రిస్క్‌లో స్పష్టమైన పెరుగుదల కనిపించలేదు. కానీ అకౌస్టిక్ న్యూరోమా కేసులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ కొన్ని అధ్యయనాలు రిస్క్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పగా, మరికొన్ని “స్పష్టమైన ఆధారం లేదు” అని చెబుతున్నాయి. కానీ ఎక్కువ కాలం, ఎక్కువసేపు చెవికి అడ్డం పెట్టి మాట్లాడే వారిలోనే రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. Link

Next Story