- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవర్ థింకింగ్‌తో 2- 4 గంటలు నిద్రను కోల్పోతున్న మహిళలు..!
పురుషులతో పోలిస్తే 74% మంది మహిళలు ఒత్తిడి వల్ల, 68% మంది ఆందోళన వల్ల ఓవర్ థింకింగ్ బారిన పడుతున్నారు. దీనివల్ల నాణ్యమైన నిద్రను కోల్పోతున్నారు.

దిశ, ఫీచర్స్ : స్త్రీలు యావరేజ్‌గా రాత్రిపూట 2 నుంచి 4 గంటల నిద్రను ఓవర్ థింకింగ్ వల్ల కోల్పోతున్నారని, ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వాదన ఈ మధ్య సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతోంది. కాగా ఓవర్ థింకింగ్ ప్రమాదకరమే కానీ.. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా వరకు పురుషులకంటే మహిళలు ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని, దీనివల్ల నిద్రలేమి లేదా నిద్రా భంగం(Sleep disturbance) వంటి సమస్యలు సైతం అనుభవిస్తున్నారని పరిశోధనలు చూపిస్తున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి!
74% ఒత్తిడి, 68% ఆందోళన
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సర్వే ప్రకారం.. పురుషులతో పోలిస్తే 74% మంది మహిళలు ఒత్తిడి వల్ల, 68% మంది ఆందోళన వల్ల ఓవర్ థింకింగ్ బారిన పడుతున్నారు. దీనివల్ల నాణ్యమైన నిద్రను కోల్పోతున్నారు. అయితే పర్యవసనాల విషయానికి వస్తే స్త్రీలు పురుషుల కంటే రెండింతలు ఎక్కువగా డిప్రెషన్, ఆందోళనలతో బాధపడుతున్నారు. ఇది వారిలో ఇన్‌సామ్నియా (Insomnia)కు దారితీస్తున్నది. ఇక గాలప్ పోల్ ప్రకారం కూడా 18-49 సంవత్సరాల మహిళలు పురుషుల కంటే 53% ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తూ తక్కువ నిద్రను పొందుతున్నారు. ఇక ఓవర్‌థింకింగ్ లేదా పదే పదే వేధించే ఆలోచనలు(Rumination) స్త్రీలలో ఎక్కువగా వస్తూ నిద్రను అడ్డుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారకాలు ఒత్తిడి, ఆందోళన, పనుల్లో మల్టీటాస్కింగ్ అంటున్నారు నిపుణులు.
మల్టీ టాస్కింగ్‌తో రెస్ట్‌లెస్
చాలామంది స్త్రీలు కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహించడం. అదనంగా ఇంటి పనులు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం వంటి అదనపు బాధ్యతలు మోస్తున్నారు. ఇవి మెదడును నిరంతరం యాక్టివ్‌గా ఉంచుతూ, విశ్రాంతి తీసుకోవడాన్ని కష్టతరం చేస్తున్నాయి. క్రమంగా ఓవర్ థింకింగ్‌కు, హార్మోనల్ మార్పులకు(Menstruation, menopause), నిద్రలేమికి కారణం అవుతున్నాయి. తక్కువ నిద్ర వల్ల ఒత్తిడి, కోపం, మానసిక అలసట పెరుగుతాయి. ఇవి డిప్రెషన్, యాంగ్జైటీలకు దారితీస్తాయి. ప్రస్తుతం చాలామంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి మొత్తం ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. నిద్ర లోపం వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్ దెబ్బతింటుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, డయాబెటిస్ వంటి హెల్త్ రిస్క్ పెరుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఓవర్ థింకింగ్‌ను వదిలేయాలని, కనీసం 6 గంటలకు మించిన క్వాలిటీ స్లీప్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.






