- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుషులకంటే మహిళలే సేఫ్ డ్రైవర్లు..! అధ్యయనాలు చెప్పే షాకింగ్ ఫ్యాక్ట్స్
మహిళలు వాహనాలు నడపడంలో చక్కటి స్కిల్స్ ప్రదర్శిస్తారు. రాబోయే ప్రమాదకర పరిస్థితులను పురుషులకంటే 12–18% వేగంగా, ముందస్తుగా గుర్తిస్తారు.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు కార్లు, బైకులు, ఇతర వాహనాలు ఎక్కువగా పురుషులే నడిపేది. కానీ ఇప్పుడు స్త్రీ, పురుషులందరూ నడుపుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కార్ డ్రైవింగ్‌లో పురుషులకంటే మహిళలే మంచి నైపుణ్యం కనబరుస్తారనే టాక్ ఉంది. అధ్యయనాలు, పలు దేశాలకు సంబంధించిన నివేదికలు సైతం ఇదే చెబుతున్నాయి. పురుషులతో పోలిస్తే.. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీలు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా నడిపిస్తారని, ప్రమాదాల రిస్క్ తగ్గుతుందని పేర్కొంటున్నాయి. అందుకు గల కారణాలేమిటో చూద్దాం పదండి!
ప్రమాదాలను ముందే గుర్తిస్తారు
స్పెయిన్, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లోని అధ్యయన నివేదికల ప్రకారం.. మహిళలు వాహనాలు నడపడంలో చక్కటి స్కిల్స్ ప్రదర్శిస్తారు. పైగా వీరు నడినప్పుడు పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రాబోయే ప్రమాదకర పరిస్థితులను స్త్రీలు పురుషులకంటే 12–18% వేగంగా, ముందస్తుగా గుర్తిస్తారు. ఇది వాడి మెదడు పనితీరుతో సంబంధం కలిగి ఉందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే.. భవిష్యత్తులో ఏం జరగవచ్చునో అంచనా వేయడంలో, విజువల్ సిగ్నల్స్(visual cues)ను వేగంగా ప్రాసెస్ చేయడంలో మహిళల మెదడు మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాస్తవంలో కూడా ఇది అనేక సందర్భాల్లో ప్రూవ్ అవుతూ ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఎమర్జెన్సీలో స్పీడ్ రియాక్షన్
ప్రమాదాలను పసిగట్టడంతోపాటు.. సున్నితంగా, కచ్చితంగా చర్యలు తీసుకోవడంలో మహిళలు ఎప్పుడూ ముందుంటారు. అంతేకాదు వీరు ట్రాఫిక్ నియమాలను ఎక్కువగా పాటిస్తారని, రిస్క్ తీసుకోవడం తక్కువగా ఉంటుందని, ఎమర్జెన్సీ సిచుయేషన్లలో వేగంగా రియాక్ట్ అవుతారని స్పెయిన్, ఆస్ట్రేలియా, యూకే రీసెర్చ్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. మరో విషయం ఏంటంటే.. పురుషులు స్పీడింగ్, అగ్రెసివ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి రిస్కీ బిహేవియర్‌లు ఎక్కువ చేస్తుంటారు. మహిళలతో పోలిస్తే పురుషులు వాహనాలు నడిపేటప్పుడు జరిగే రోడ్డు ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణం. అదే మహిళలైతే ఈ సమస్య ఉండదు. పైగా వీరు జాగ్రత్తగా అంటిసిపేటరీ (ముందుగా అంచనా) డ్రైవింగ్ చేస్తారు. దీంతో రోడ్ సేఫ్టీలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శిస్తారు. మహిళలు సేఫ్ డ్రైవింగ్ చేస్తారనేది ఇండియాకు కూడా వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. రోడ్ యాక్సిడెంట్లలో మహిళలు తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. పురుషులు 6.2 రెట్లు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలోనూ మహిళలు తక్కువ వయోలేట్ చేస్తారు. పురుషులతో పోలిస్తే ఓవర్ స్పీడింగ్ 12% తక్కవగా, హార్డ్ బ్రేకింగ్ 11% తక్కువగా చేస్తారని కొన్ని ప్రైవేట్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీల సర్వేలు పేర్కొంటున్నాయి.






