ఆర్గ్యుమెంట్స్‌లోనూ.. అర్థం చేసుకోవడంలోనూ స్త్రీలదే పైచేయి.. కారణమిదే..

by Javid Pasha |

పరిశోధనల ప్రకారం కూడా స్త్రీలు తరచూ సరైన దృక్పథాన్ని అందిస్తారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ సెన్సిటివిటీ, సానుభూతిలో ఉన్నత స్థాయిలను ప్రదర్శిస్తారు.

ఆర్గ్యుమెంట్స్‌లోనూ.. అర్థం చేసుకోవడంలోనూ స్త్రీలదే పైచేయి.. కారణమిదే..
X

దిశ, ఫీచర్స్ : వామ్మో ఆర్గ్యుమెంట్స్‌లో అమ్మాయిలతో లేదా స్త్రీలతో నెగ్గడం కష్టం అంటుంటారు కొందరు. అయితే ఇటీవలి ఒక అధ్యయనం ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నది. సంబంధాలలో జరిగే ఆర్గ్యుమెంట్స్ విషయంలో అవతలి వ్యక్తిని అంచనా వేయడంలో పురుషులకంటే స్త్రీలే ఎక్కువ సామర్థ్యం ప్రదర్శిస్తారని, తెలివిగా ఆలోచిస్తారని, అర్థం చేసుకోవడంలోనూ ముందుంటారని నిపుణులు చెబుతున్నారు. ‘Journal of Personality and Social Psychology’లో పబ్లిషైన గత అధ్యయన వివరాలు సైతం స్త్రీలు సానుభూతి, భావోద్వేగ అవగాహనలో సగటున పురుషుల కంటే మెరుగైన సామర్థ్యాలను చూపిస్తారని తెలియజేస్తున్నాయి.

గత పరిశోధనల ప్రకారం కూడా స్త్రీలు తరచూ సరైన దృక్పథాన్ని అందిస్తారు(Women often provide the right perspective.) ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ సెన్సిటివిటీ, సానుభూతి(In empathy and emotional sensitivity)లో ఉన్నత స్థాయిలను ప్రదర్శిస్తారు. ఈ గుణాలే అమ్మాయిలు లేదా స్త్రీలలు తమ రిలేషన్‌షిప్‌లో విభేదాలను సునిశితంగా విశ్లేషించే సామర్థ్యాన్ని, ఆలోచనాత్మకంగా స్పందించే నైపుణ్యాన్ని, సమస్యల మూల కారణాలను గుర్తించే ప్రతిభను అందిస్తాయి. ఉదాహరణకు సంబంధాలలో ఉద్భవించే ఘర్షణలను స్త్రీలు తమ భావోద్వేగ అవగాహనతో లోతుగా అర్థం చేసుకొని, సమతుల్య పరిష్కారాలను(balanced solutions) సూచించగలరని అధ్యయనం చెబుతున్నది.

ఆర్గ్యుమెంట్స్‌లో స్త్రీల సామర్థ్యం సంబంధాలలో సమర్థవంతమైన సంభాషణను ప్రోత్సహిస్తుందని కూడా అధ్యయనం పేర్కొన్నది. అలాగే భాగస్వామిని అర్థం చేసుకోవడంతోపాటు అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని, దృక్కోణాన్ని గౌరవించాలన్న ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతున్నదని స్పష్టం చేసింది. అయితే పురుషులు ఎల్లప్పుడూ తప్పు చేస్తారని లేదా తప్పుగా అర్థం చేసుకుంటారని కాదిక్కడ. కానీ స్త్రీల సామర్థ్యం, ఆర్గ్యుమెంట్ సంభాషణలో భావోద్వేగ విలువను హైలైట్ చేస్తుందని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. Link

Next Story