- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలు మెదడు పనితీరును మారుస్తాయా?.. నిపుణుల వెర్షన్ ఇదే..!
సినిమాలు ఆనందాన్ని, భావోద్వేగాన్ని ప్రేరేపిస్తాయి. వాటిని చూస్తున్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్ అనే న్యూరోకెమికల్‌ను విడుదలవుతుంది.

దిశ, ఫీచర్స్ : ప్రజలు అత్యంత ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్‌లో సినిమాలు చూడటం కూడా ఒకటి. దీనివల్ల ఆనందం కలుగుతుందని, స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని చాలామంది చెబుతుంటారు. అయితే క్లేర్‌మాంట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీలో జరిగిన ఒక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నది. భావోద్వేగపూరితమైన సినిమాలు చూడటం లేదా కథలు వినడంవల్ల మన మెదడులో పలు రకాలుగా రసాయనిక మార్పులు జరుగుతాయని తెలిపింది. ఇంకా ఏయే ప్రభావాలు ఉంటాయి? ఏ విధమైన ప్రయోజనాలు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని రకాల సినిమాలు ఆనందాన్ని, భావోద్వేగాన్ని ప్రేరేపిస్తాయి. దీంతో అవి చూస్తున్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్ (oxytocin) అనే న్యూరోకెమికల్‌ను విడుదల అవుతుంది. దీనిని ‘బాండింగ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇది మానవుల మధ్య సంబంధాలను మెరుగు పర్చడంలో, సామాజిక సూచనలను గుర్తించడంలో సహాయపడుతుంది. అనుబంధాలు, నమ్మకాలు వంటి భావాలతో ముడిపడి ఉంటుంది. ఇక కథలోని పాత్రల భావోద్వేగాలతో కూడా మనం లీనమైపోతుంటాం. అప్పుడు మెదడు ఆక్సిటోసిన్‌ను ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా ఆయా క్యారెక్టర్లు(characters) అనుభవించే భావాలను మనమూ అనుభవించేలా చేస్తుంది. దీనిని సైంటిస్టులు ‘Empathic Transportation’ అంటారు. అంటే కథలోని భావాలను కాసేపు మనకు ఆపాదించుకోవడం లేదా సొంతంగా భావించడం చేస్తుంటాం. ఈ భావోద్వేగ పరిస్థితి మెదడు నరాలను సైతం ఉత్తేజ పరుస్తుంది. అందుకే సినిమా కేవలం ఆనందాన్నిచ్చే వినోదం మాత్రమే కాదు. అది మానవ సంబంధాలను, ఉదార భావాలను సైతం ప్రేరేపించడం ద్వారా మానసిక ఆరోగ్య వికాసానికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రయోజనాలు
*కల్పనా శక్తి, సామాజిక అవగాహన పెరుగుతాయి. ఆక్సిటోసిన్ రిలీజ్ కావడం వల్ల ఇతరుల భావాలను బాగా అర్థం చేసుకోవడం, జాలి దయ, కరుణ(Compassion) వంటివి పెరుగుతాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (emotional intelligence) మెరుగవుతుంది.
*ఆక్సిటోసిన్ పెరిగిన వారు ఛారిటీలకు ఎక్కువ డొనేట్ చేస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి మొగ్గు చూపిస్తారు. వినోదాన్ని పెంచే సినిమాలవల్ల ఈ భావాలు పెంపొందుతాయి.
*సినిమాలు చూసిన తర్వాత సామాజిక బంధాలు బలపడతాయి. ఒంటరితనం తగ్గుతుంది. గ్రూప్‌లో చూస్తే ఎండార్ఫిన్స్ వల్ల పెయిన్ టాలరెన్స్ కూడా పెరుగుతుంది.
*మనసులో దాచుకున్న భావోద్వేగాల(Pent-up emotions)కు సంబంధించిన ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి. ఏడుపు వల్ల మూడ్ మెరుగవుతుంది. రిలాక్సేషన్ లభిస్తుంది.
*సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్ పెరుగుతుంది. పాజిటివ్ ట్రెయిట్స్ (kindness, courage) చూసినప్పుడు ఎలివేషన్ భావం వస్తుంది. తమను తాము మెరుగు పర్చుకునే లేదా మార్చుకునే స్వయం ఎదుగుదల భావాన మోటివేట్ అవుతుంది. అయితే సినిమాలు మాత్రమే నిజ జీవిత సంబంధాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలకు పూర్తి ప్రత్యామ్నాయం కాదు. ఇవన్నీ ఆయా వ్యక్తుల అవగాహన స్థాయిని బట్టి వ్యక్తిగతంగా మారవచ్చునని కూడా నిపుణులు అంటున్నారు.






