పుస్తక పఠనం.. ఒత్తిడి మాయం..!

by Javid Pasha |

అది వచనం, కవిత్వం, నవల, నాన్-ఫిక్షన్ ఇలా ఇంకే రూపంలో ఉన్నా సరే పుస్తకం చదవడమనేది మీలో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

పుస్తక పఠనం.. ఒత్తిడి మాయం..!
X

దిశ, ఫీచర్స్ : పుస్తక పఠనం సరదాకో, విజ్ఞానానికో మాత్రమే కాదండోయ్.. అది ఇంకెన్నో అద్భుతాలు కూడా చేయగలదు. లేనిపోని ఆలోచనలతో, అధిక ఒత్తిడితో, ఆందోళనతో మీ మైండ్ బర్న్ అవుతుంటే చక్కటి పరిష్కారం చూపగలదు. మొద్దుబారిన మీ మెదడు గేర్‌ను మార్చేసి, ప్రమాదకర స్థాయిలో ఉన్న మీ గుండె చప్పుడును ప్రశాంతంగానూ మార్చగలదు.

6 నిమిషాలు చదివినా చాలు

మీరు ఒత్తిడితో సతమతం అవుతున్నప్పుడు జస్ట్ మీకు నచ్చిన పుస్తకం చదివండి చాలు. మీలోని ఒత్తిడి చిత్తవుతుందని ససెక్స్ యూనివర్సిటీలో కాగ్నెటివ్ న్యూరో సైకాలజిస్ట్ అయిన డాక్టర్ డేవిడ్ లూయిస్ అంటున్నారు. 6 నిమిషాల బుక్ రీడింగ్.. 68% వరకు ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో వెల్లడైందని చెబుతున్నారు. అంతేకాదు. చదివే అలవాటు మీలో విజ్ఞనాన్ని, భాషా పరిజ్ఞానాన్ని పెంచడంతోపాటు, మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

పుస్తకం ఏదైనా.. ఫలితం అదే

అది వచనం, కవిత్వం, నవల, నాన్-ఫిక్షన్ ఇలా ఇంకే రూపంలో ఉన్నా సరే పుస్తకం చదవడమనేది మీలో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కండరాల ఉద్రిక్తతను(Relaxes muscle tension) సడలిస్తుంది. మైండ్‌ను రీసెంట్ చేస్తుంది. అంటే సంగీతం వినడం (61%), టీ తాగడం, (54%), లేదా వాకింగ్ చేయడం (42%) కంటే కూడా ఇది మోస్ట్ ఎఫెక్టివ్‌గా మీ మూడ్‌ను మార్చేస్తుంది. మీలోని ఒత్తిడి, ఆందోళనలను పటా పంచలు చేసేస్తుంది. ఇంకెందుకాలస్యం.. మీకు నచ్చిన పుస్తకమేదో వెతుక్కోండి!

Next Story