పిల్లలతో ఇంట్లో ఉండటమే పెద్ద యుద్ధం! ఆఫీసు జాబ్ కంటే అధిక ఒత్తిడికి దారితీస్తున్న పేరెంటింగ్!

by Javid Pasha |   (  Updated:2025-11-29 11:09:02  IST  )

పిల్లల్ని కనడం, కుటుంబాన్ని కలిగి ఉండటం పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అని 48% మంది తల్లిదండ్రులు భావిస్తుండగా, 43% మంది పిల్లల్ని చూసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లడం ‘మిలిటరీ ఆపరేషన్’ లాగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు.

పిల్లలతో ఇంట్లో ఉండటమే పెద్ద యుద్ధం! ఆఫీసు జాబ్ కంటే అధిక ఒత్తిడికి దారితీస్తున్న పేరెంటింగ్!
X

దిశ, ఫీచర్స్ : మీకేంటి ఇంట్లో ఉంటారు హాయిగా.. సమయానికి పనులు పూర్తి చేసుకోవచ్చు.. పిల్లలతో సంతోషంగా గడపవచ్చు అంటుంటారు కొందరు. కానీ పిల్లలతో సమయం స్పెండ్ చేయడం, వారి ఆలనా పాలనా చూడటం అంత ఈజీ కాదంటున్నాయి అధ్యయనాలు. బయటకు వెళ్లి పనులు చేయడం కంటే, జాబ్ చేయడం కంటే కూడా పిల్లలతో ఇంట్లో ఉండటం ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుందన్నా చెబుతున్నాయి. అధ్యయనంలో భాగంగా యూకేకు చెందిన నిపుణులు 1,500 మంది తల్లిదండ్రులను ప్రశ్నించగా 31% మంది ఇంట్లో ఉండి చిన్నారు చూసుకోవడమంటే.. వర్క్ లేదా జాబ్ చేయడంకంటే కూడా కంటే కష్టమని అభిప్రాయపడ్డారు. ఇది తల్లిదండ్రులలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, ఇంటి పనులు-బిడ్డల సంరక్షణ మధ్య బ్యాలెన్స్‌ ఎదుర్కొనే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను హైలైట్ చేసింది.

పిల్లల్ని కనడం, కుటుంబాన్ని కలిగి ఉండటం పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అని 48% మంది తల్లిదండ్రులు భావిస్తుండగా, 43% మంది పిల్లల్ని చూసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లడం ‘మిలిటరీ ఆపరేషన్’ లాగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిడి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక స్థితికి ప్రభావితం చేస్తుందని, పిల్లలు కలిగిన పేరెంట్స్‌కు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరమని పేర్కొన్నారు.

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్‌వర్క్ ఓపెన్‌లో పబ్లిషైన మరొక అధ్యయనం మహమ్మారి సమయంలో రిమోట్‌గా వర్క్ చేసిన తల్లిదండ్రులలో 40% మంది పేరెంటింగ్ స్ట్రెస్ (Childcare stress) పెరిగినట్లు రిపోర్ట్ చేశారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ & ఆన్ అండ్ రాబర్ట్ H. లూరీ చైల్డ్రన్స్ హాస్పిటల్‌లో జరిగిన ఈ స్టడీలో 1,000కి పైగా తల్లిదండ్రులను ప్రశ్నించారు. పిల్లను చూసుకోవడం ఆఫీస్‌లో పని చేస్తున్నవారికంటే 27% ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తున్నట్లు తేలింది.

ముఖ్యంగా తండ్రులలో రిమోట్ వర్క్ చేసినవారు ఆన్‌సైట్‌గా పని చేసినవారి కంటే రెండు రెట్లు ఎక్కువ ఒత్తిడి అనుభవించారు. ఇంటిలో విరామాలు లేకపోవడం, సోషల్ ఇంటరాక్షన్ తక్కువగా ఉండటం, మెంటల్ లోడ్ (Invisible Labor) ఎక్కువగా ఉండటం ఈ విధమైన ఒత్తిడికి దారితీస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తంగా తల్లిదండ్రుల ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, సపోర్ట్ సిస్టమ్స్ (Family, Policies) మెరుగుపడితే ఇది తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story