Technology : ఫోన్ పక్కన పెట్టుకొని నిద్ర.. మెదడుకు 12 ఏండ్ల ముందే వృద్ధాప్యం!

by Javid Pasha |   (  Updated:2025-09-24 05:57:26  IST  )

ఫోన్‌లు ఎంటర్టైన్మెంట్ టూల్స్‌గా కనిపించినప్పటికీ, అవి నిద్ర సమయంలో మెదడును నెమ్మదిగా దెబ్బతీసే యంత్రాలుగా పనిచేస్తాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Technology : ఫోన్ పక్కన పెట్టుకొని నిద్ర.. మెదడుకు 12 ఏండ్ల ముందే వృద్ధాప్యం!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతీ ఒక్కరు సెల్‌ఫోన్ వాడుతున్నారు. నిజం చెప్పాలంటే జీవితంలో అదొక భాగమైపోయింది. అయితే కొందరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా దానిని పక్కన పెట్టుకొని నిద్రపోతుంటారు. మరికొందరైతే తలదిండు కింద కూడా పెట్టుకుంటారు. ఇంకొందరు తమ బెడ్‌కి సమీపంలో అంటే చేతికందినంత దూరంలోనే పెట్టి నిద్రపోతుంటారు. ఇక మధ్యలో నిద్రమేల్కొన్నప్పుడు టైమెంతయిందనో, నోటిఫికేషన్లు ఏం వచ్చాయో చూద్దామనో చెక్ చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదమని, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

* ఫోన్లు ఆధునిక జీవనశైలిలో అంతర్భాగమైనప్పటికీ, వాటిని జాగ్రత్తగా వాడకపోతే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఇటీవలి పరిశోధనలు సైతం పేర్కొంటున్నాయి. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు దగ్గరగా పెట్టుకుంటే.. ఫోన్ ఆన్‌లో ఉన్నా, ఆఫ్‌లో ఉన్నా అది విడుదల చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌లు (EMF) మెదడు సహజ శుద్ధి చక్రాన్ని(natural cleansing cycle) ఆటంకపరుస్తాయి. ఇవి మెదడు రాత్రిపూట విష పదార్థాలను తొలగించే గ్లింఫాటిక్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీనివల్ల మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంది.

*ఫోన్‌ల నుంచి వెలువడే నీలి కాంతి కళ్లలోని రెటీనాలో గంటలపాటు నిలిచి ఉంటుంది. ఫలితంగా మెదడుకు ఇంకా పగలే అనే సంకేతాన్ని పంపుతుంది. దీంతోపాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌లు మెదడు సహజ రిపేరింగ్ సిస్టమ్‌ను, అలాగే పనితీరులో పునరుత్పత్తి ప్రక్రియనును దెబ్బతీస్తాయి. గాఢమైన నిద్ర దశల(REM and deep sleep)కు ఆటంకం కలిగిస్తాయి. నిద్ర నాణ్యతను దెబ్బతీసి, మానసిక స్పష్టత(Mental clarity)ను, జ్ఞాపక శక్తిని దీర్ఘకాలంలో దెబ్బతీస్తాయి.

*నిద్ర సమయంలో ఫోన్‌లను సమీపంలో ఉంచుకునే వ్యక్తుల మెదడు స్కాన్‌లు ఆందోళనకర వాస్తవాలను బయటపెడుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇటువంటి వ్యక్తుల మెదడు, ఫోన్ల పక్కన పెట్టుకోకుండా పడుకునేవారితో పోలిస్తే 12 సంవత్సరాల ముందస్తు వృద్ధాప్యానికి దారితీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఈ అలవాటు మెదడు కణాల నష్టం, జ్ఞాపకశక్తి క్షీణత, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

* ఫోన్‌లు ఎంటర్టైన్మెంట్ టూల్స్‌గా కనిపించినప్పటికీ, అవి నిద్ర సమయంలో మెదడును నెమ్మదిగా దెబ్బతీసే యంత్రాలుగా పనిచేస్తాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించడానికి, నిద్ర సమయంలో ఫోన్‌ను గదిలో దూరంగా ఉంచడం ఉంచడం లేదా ఆఫ్ చేయడం, నీలి కాంతిని తగ్గించే స్క్రీన్ ఫిల్టర్‌లను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. Link

Next Story