- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుభవాలు పంచుకుంటే బలపడుతున్న ప్రేమానుబంధాలు.. కారణం ఇదే.. !
వ్యక్తులు తమ అనుభవాలను షేర్ చేసుకోవడం జంటల మధ్య భావోద్వేగ సురక్షితాన్ని, నమ్మకాన్ని, లోతైన ప్రేమానుబంధాన్ని నిర్మించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : అనుభవం ఒక జ్ఞానం, అనుభవం ఒక అవగాహన, అనుభవం ఒక గుణ పాఠం అంటుంటారు పెద్దలు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలని, అనుభవం ద్వారా చెప్పిన విషయాల్లో వాస్తవం ఉంటుందని కూడా చెబుతుంటారు. అయితే ఇది మాత్రమే కాదండోయ్.. కలిసి ప్రయాణించడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం, కలిసి విహార యాత్రలకు వెళ్లడం వంటివి కూడా ఆయా వ్యక్తుల మధ్య, ముఖ్యంగా జంటల మధ్య బలమైన ప్రేమానుబంధానికి దారితీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కలిసి పంచుకునే అనుభవాలు, జ్ఞాపకాలు మానసిక ఆనందాన్నిస్తాయి. ఉదాహరణకు ఫ్లైట్ ఆలస్యం లేదా కొత్త సంస్కృతి అనుభవం, జంటలను ఒకరిపై ఒకరు ఆధారపడేలా చేస్తాయి. ఇది నాడీ వ్యవస్థలో సురక్షిత సిగ్నల్స్‌ను పంపి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
అనుభవాలను పరస్పరం షేర్ చేసుకోవడం కేవలం బలమైన ప్రేమను పెంచడమే కాదు, వ్యక్తులు లేదా జంటల మధ్య భావోద్వేగ సురక్షితం(Emotional safety), నమ్మకం, మరింత లోతైన అనుబంధాన్ని నిర్మించడంలో సహాయపడతాయని గాట్‌మన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ జాన్ గాట్‌మన్ (Dr. John Gottman) నిర్వహించిన అధ్యయనం చెబుతున్నది. అయితే ఇక్కడ అనుభవాలు షేర్ చేసుకోవడమే కాదు, అందుకు అనువైన సందర్భాలు, పరిస్థితులు సైతం ప్రేమాను బంధాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని కూడా పేర్కొన్నది. అందుకు చక్కటి ఉదాహరణ విహార యాత్రలు. ఇవి కేవలం వెకేషన్స్ మాత్రమే కాదు, ఒక విధంగా బాండింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటివి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇక్కడ ‘షేర్డ్ ఎక్స్‌పీరియన్సెస్’ అనేవి డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. ఇవి వ్యక్తుల మధ్య ప్రేమ, సంతోషం, భావోద్వేగ అనుబంధాన్ని, ప్రేమను బలోపేతం చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. ఎమోషనల్ సేఫ్టీని, నమ్మకాన్ని పెంపొందిస్తాయి.






