- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hobbits : ఉదయం 7 గంటలకంటే ముందు నిద్రలేచేవారే జీవితంలో సంతోషంగా ఉంటారు.. కారణం ఇదే..
Hobbits : ఉదయం 7 గంటలకంటే ముందు నిద్రలేచేవారే జీవితంలో సంతోషంగా ఉంటారు.. కారణం ఇదే..

దిశ, ఫీచర్స్ : సంతోషంగా ఉండటమనేది మానసిక భావనకు సంబంధించినదే అయినప్పటికీ, రోజువారీ దినచర్యలతో కూడా ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా నిద్ర అలవాట్లు ఇందులో కీలకపాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఏ సమయానికి నిద్రపోతారు, ఏ సమయానికి మేల్కొంటారనే దానిని బట్టి కూడా ఆయా వ్యక్తుల జీవితంలో సంతోషం, బాధలు, ఆరోగ్యాలు ప్రభావితం అవుతుంటాయని వెల్లడించింది. సాధారణంగా ఉదయం 7 గంటలకంటే ముందే నిద్రలేచేవారు, ఇతరులతో పోలిస్తే ఆనందగా ఉంటారని స్పష్టం చేసింది. అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఉదయం 7 నుంచి 8 గంటలలోపు నిద్రలేచేవారు(Morning people), అంతకంటే ఆలస్యంగా నిద్రలేచేవారితో పోలిస్తే ఆరోగ్యంగా, సంతోషంగా, తక్కువ బరువు కలిగి ఉంటారని నిపుణులు చెబుతుంటారు. ఇటీవల 1,068 మంది పెద్దలపై నిర్వహించిన ఓ క్రోనో బయాలజీ అధ్యయనం కూడా అదే వెల్లడించింది. ఉదయం త్వరగా(Early risers), అంటే 7 గంటల నుంచి 7:47 గంటలలోపు నిద్రలేచేవారి వారితో పోల్చినప్పుడు, మార్నింగ్ లేట్‌గా, అంటే 9 గంటల తర్వాత నిద్ర లేచేవారు(Night Owls) ఎక్కువగా అనారోగ్యాలను ఎదుర్కొంటారని, జీవితంలో మానసిక ఆనందాన్ని కోల్పోతారని తెలిపింది. ఎందుకంటే ఉదయం లేట్‌గా నిద్రలేచేవారు సాధారణంగా రాత్రి ఆలస్యంగా పడుకుంటూ ఉంటారు. పైగా ఆహారంలో భాగంగా ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువ తింటూ పండ్లు, కూరగయలు వంటివి తక్కువ తినే అవకాశం ఉంటుంది. ఈ విధమైన అలవాట్లు ఆలస్యంగా నిద్రలేచేవారిలో అనారోగ్యానికి దారితీస్తాయి.
ఉదయం 7 గంటలలోపు లేదా 7:47 గంటలలోపు నిద్రలేచేవారు ఇతరులతో పోలిస్తే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే త్వరగా లేచేవారు ప్రకృతి సిద్ధమైన సహజ కాంతికి బహిర్గతం కావడంవల్ల వీరి సర్కాడియన్ రిథమ్ నియంత్రణలో ఉంటుంది. అలాగే ఉదయపు వాతావరణం సెరోటోనిన్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. దీంతో వీరు ఆలస్యంగా నిద్రలేచేవారితో పోలిస్తే ఎక్కువ సంతోషంగా ఉంటారు. డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు వచ్చే చాన్స్ కూడా తక్కువ. అంతేకాకుండా మార్నింగ్ నిద్రలేవడం వల్ల వ్యాయామాలు, దినచర్యలో భాగంగా వివిధ పనులు చేస్తుంటారు. ఆహారపు అలవాట్లు కూడా సమతుల్యంగా ఉంటాయి. దీంతో వీరు అధిక బరువు పెరిగే అవకాశం ఉండదు. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయి. ఇవన్నీ మానసిక ఆనందానికి, జీవితంలో సంతోషానికి కారణం అవుతాయి.






