- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజుకు 6 గంటలు ఫోన్లల్లో నిమగ్నమైతే.. ఆర్థిక సమస్యలతోపాటు ఈ అనారోగ్యాలు తప్పవ్.!
రోజుకు 6 గంటలు ఫోన్లల్లో నిమగ్నమైతే..ఆర్థిక సమస్యలతోపాటు ఈ అనారోగ్యాలు తప్పవ్.!

దిశ, ఫీచర్స్ : అదే పనిగా గంటల తరబడి ఫోన్లలో నిమగ్నమవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విషయం తెలిసిందే. కానీ తాజా అధ్యయనం మరో కొత్త అంశంతో ముందుకొచ్చింది. సగటున 6 గంటలపాటు ఫోన్లకే పరిమితం అయ్యేవారు అనారోగ్యాలతోపాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ‘మలేషియన్ ఆన్‌లైన్ జర్నల్’ స్టడీలో వెల్లడైంది. ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ’లో పబ్లిషైన అధ్యయనం కూడా ఇదే స్పష్టం చేసింది. అయితే ఈ కారణంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తు్న్నవారిలో లో ఇన్‌కం పీపులే ఎక్కువగా ఉంటున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అత్యధిక సమయం ఫోన్లలో గడపడం వల్ల ఆందోళన, నిద్రలేమి, ఒంటరితనం వంటి సమస్యలు తలెత్తాయని, క్రమంగా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంపై ప్రభావం పడుతుందని, ప్రొడక్టివిటీ తగ్గుతుందని అధ్యయనం పేర్కొన్నది. అంతేకాకుండా అధిక స్క్రీన్ టైమ్ కారణంగా హఠాత్తు కొనుగోళ్లు, స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌లు వంటి అనవసర ఖర్చులు పెరుగుతాయని, ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని కూడా వెల్లడించింది. అంతేకాకుండా అధిక సమయం సెల్‌ఫోన్ చూడటంవల్ల కళ్లు పొడిబారడం, తలనొప్పి, మెడ నొప్పి, దృష్టి లోపాలు, చిటికెన వేలు నొప్పి (Smartphone Pinky), ఊబకాయం వంటి ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 4 గంటలకు మించి దాదాపు 6 గంటల సమయం వరకు స్మార్ట్‌ఫోన్లలో నిమగ్నం అవుతున్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, ఆత్మవిశ్వాసం లోపించడం, యాంగ్జైటీ, డిప్రెషన్, స్పీచ్ డిజార్డర్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతోపాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఈజీగా యాక్సెస్ చేసే అవకాశం కారణంగా కొందరు అశ్లీల కంటెంట్‌కు బానిస కావడం, అనైతిక కార్యకలాపాలకు ఆకర్షితులవడం వంటి సామాజిక సమస్యలు సైతం తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు.






