పెళ్లి చేసుకోకపోతే పెరుగుతున్న ముందస్తు మరణాలు.. అధ్యయనాల్లో షాకింగ్ నిజాలు!

by Javid Pasha |

కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. మ్యారీడ్ పీపుల్‌తో పోలిస్తే, అన్‌మ్యారీడ్ పీపుల్స్‌లో డెత్ రిస్క్ 8.77% ఎక్కువ.

పెళ్లి చేసుకోకపోతే పెరుగుతున్న ముందస్తు మరణాలు.. అధ్యయనాల్లో షాకింగ్ నిజాలు!
X

దిశ, ఫీచర్స్ : గాలి, నీరు, ఆహారం మాదిరిగానే మానవ జీవితంలో పెళ్లి కూడా అవసరం. అలాగనీ అందరూ కచ్చితంగా పెళ్లిళ్లు చేసుకోవాలనే రూలేం లేదు. ఎవరిష్టం వాళ్లది. ఎవరి జీవితం ఎలా ఉండాలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయించుకోవాల్సిందే. అయితే పెళ్లి.. జీవితంపై దాని ప్రభావం విషయానికి వస్తే మాత్రం.. ఒక తాజా అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. జీవితకాలంలో పెళ్లి చేసుకున్న వ్యక్తులతో పోలిస్తే.. చేసుకోనటువంటి వ్యక్తులు సాధారణ ఆయుష్షుకంటే ముందుగానే మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

8.77% ఎక్కువ డెత్ రిస్క్

కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రాబర్ట్ కప్లాన్ అండ్ రిచర్డ్ క్రొనిక్(Robert Kaplan and Richard Kronick) నేతృత్వంలోని ఒక కొత్త పరిశోధన ప్రకారం.. మ్యారీడ్ పీపుల్‌తో పోలిస్తే, అన్‌మ్యారీడ్ పీపుల్స్‌లో డెత్ రిస్క్ 8.77% ఎక్కువ. కొన్ని వయసుల వారీలో ఇది 58% వరకు కూడా ఉంటోంది. పెళ్లికాని వ్యక్తులు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసినా, తర్వాతి జీవితంలో అధిక బరువు పెరగపోయినా వర్తిస్తుంది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 1989లో జరిగిన నేషనల్ హెల్త్ ఇంటర్వ్యూ సర్వే (NHIS)లో పాల్గొన్న సుమారు 67,000 మంది అమెరికన్ అడల్ట్స్‌‌కు డేటాను, 1997 నేషనల్ డెత్ ఇండెక్స్‌తో ముడిపెట్టి విశ్లేషించారు. అయితే లేటుగా వివాహం చేసుకునే వారికి ఇది వర్తించదు. జీవితంలో ఎప్పటికీ పెళ్లిచేసుకోకుండా ఉండే వారికి మాత్రమే ఈ ప్రమాదం పొంచి ఉందని అధ్యయనం తెలిపింది.

కారణాలు.. వయసు ప్రభావం

పెళ్లి చేసుకోని వారిలో పెరుగుతున్న డెత్ రిస్క్‌ను వయసు, జెండర్ వారీగా అంచనా వేసిన అధ్యయనం 44 ఏళ్లలోపు వయసుగల వారిలో 2.12 రెట్లు మరణాలు యాక్సిండెంట్స్, హెచ్ఐవీ, ఇతర అనారోగ్యాలు వంటి కారణాలతో సంభివిస్తున్నాయి. ఆ తర్వాత కూడా దీంతోపాుట వివాహం వల్ల లభించే భావోద్వేగ మద్దతు, సామాజిక బంధాలు, వయసు, పేదరికం, ఆదాయం లేకపోవడం, మానసిక స్థిరత్వం లేకపోవడం, సోషల్ ఐసోలేషన్, అధిక రక్తపోటు పెరగడం లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వంటివి పెళ్లికాని వారిలో అర్లీ డెత్ రిస్క్ పెరగడానికి దారితీస్తున్నాయని అధ్యయనం పేర్కొన్నది. మహిళల్లో కూడా ఈ ప్రభావం ఉన్నప్పటికీ, పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తున్నదని అధ్యయనం తెలిపింది. ఇక విడాకులు తీసుకున్న వారిలోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ, జీవితాంతం పెళ్లిచేసుకోని వారిలోనే అధికంగా ఉంటోందని పేర్కొన్నది.

భారత దేశంలో..

ప్రపంచంలోనే కాదు, భారత దేశంలోనూ వివాహ బంధం వ్యక్తుల దీర్ఘాయుష్షుపై ప్రభావం చూపుతున్నదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వివాహం చేసుకున్నవారితో పోలిస్తే, ఒంటరిగా ఉన్నవారిలో (Never-married, divorced or separated) డెత్ రిస్క్ 20-30% ఎక్కువగా ఉంటున్నదని 2022 నాటి SAGE స్టడీ (BMC Public Health) పేర్కొన్నది. పెళ్లి చేసుకోనివారిలో సామాజిక మద్దతు, మానసిక స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ వంటివి లేకపోవడంతో ఇలా జరుగుతున్నట్లు తెలిపింది. 2016 BMC Public Health స్టడీ ప్రకారం కూడా 60 ఏండ్ల తర్వాత వయసులో పెళ్లి అయిన వారితో పోలిస్తే.. పెళ్లికాని వ్యక్తుల్లో, ముఖ్యంగా మహిళల్లో క్రానిక్ డిసీజెస్ (షుగర్, బ్లడ్ ప్రెజర్) వంటి మరణాలు 15-25% ఎక్కువ. ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, మెంటల్ స్ట్రెస్‌వల్ల ఇలా జరుగుతున్నది. Link

Next Story