వారంలో రెండుసార్లు ఎగ్స్ తినేవారిలో తగ్గుతున్న అల్జీమర్స్ రిస్క్.. కారణం ఇదే..

by Javid Pasha |

కొలెస్ట్రాల్ కారణంగా గుడ్లు ఎక్కువగా తినవద్దని కొందరు చెబుతుంటారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం తినడమే మంచిదని తేలింది.

వారంలో రెండుసార్లు ఎగ్స్ తినేవారిలో తగ్గుతున్న అల్జీమర్స్ రిస్క్.. కారణం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : మీరు ఎగ్స్ తింటారా? అయితే గుడ్ లక్..! ఎందుకంటే వారానికి ఒకటికంటే ఎక్కువగా కోడి గుడ్లను ఆహారంగా తినేవారికి మతిమరుపు రాదని, ముఖ్యంగా వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే రిస్క్ 47% తక్కువగా ఉంటున్నదని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. అందుకు కారణం అందులోని పోషక విలువలేనని తెలిపింది. అంతేకాకుండా గుడ్లను తినడంవల్ల లభించే పోషకాలు మెమరీ, లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సెల్స్ మధ్య నర్వర్జేషన్ ప్రాసెస్‌ను మెరుగు పరుస్తాయని వెల్లడించింది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

కొలెస్ట్రాల్ కారణంగా గుడ్లు ఎక్కువగా తినవద్దని కొందరు చెబుతుంటారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం తినడమే మంచిదని తేలింది. ఎందుకంటే సుమారు 39% గుడ్డు సొనలలో ఎక్కువగా ఉండే ముఖ్యమైన పోషకం కోలిన్ (choline)కు చెందినది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మెదడు సామర్థ్యాన్ని, నేర్చుకునే విధానాన్ని ప్రేరేపిస్తుంది. ఓవరాల్‌గా మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం.. ఒక్క కోడి గుడ్డు మన రోజువారీ కోలిన్ అవసరానికి సుమారు 25% శక్తిని అందిస్తుంది. అయితే మరీ అధికంగా తింటే కొలెస్ట్రాల్ ప్రభావం ఉండవచ్చు కానీ.. సాధారణంగా రోజుకు ఒకటి, రెండు గుడ్లను తినడం మాత్రం చాలా మంచిదని, వారానికి రెండు తిన్నా బెటరేనని, ముఖ్యంగా వృద్ధులలో అల్జీమర్స్ రిస్క్‌ను తగ్గుతుందని అధ్యయనం పేర్కొన్నది.

Next Story