కలిసి మాట్లాడుకుంటున్నారా..? Chatting చేస్తున్నారా..? ముందు ఇది తెలుసుకోండి!

by Javid Pasha |

కలిసి మాట్లాడుకుంటున్నారా..? Chatting చేస్తున్నారా..? ముందు ఇది తెలుసుకోండి!

కలిసి మాట్లాడుకుంటున్నారా..? Chatting చేస్తున్నారా..? ముందు ఇది తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్ : రోజువారీ జీవితంలో ఎంత నిజాయితీగా ఉన్నా, అప్పుడప్పుడు అబద్దాలు ఆడటమనేది మానవ సహజ లక్షణం. అయితే ఆ అబద్దం ఎవరికీ ఇబ్బంది కలిగించనిదైతే పర్లేదు. కానీ అవసరానికో అబద్ధం ఆడుతూ తమ స్వార్థం కోసం ఇతరులను బలిచేసే అబద్ధాలైతేనే సమాజానికి, వ్యక్తిగత జీవితానికి నష్టం. ఇక ఇదంతా పక్కన పెడితే.. వ్యక్తులు ముఖా ముఖి సంభాషణలతో పోలిస్తే, టెక్ట్స్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేసేటప్పుడు అబద్ధం చెప్పే అవకాశం ఎక్కువని అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఆధునిక కాలంలో ప్రజలు ఏ సందర్భాల్లో అబద్ధాలు ఎక్కువగా చెప్తారో తెలుసుకునేందుకు కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుడు జెఫ్ హాన్‌కాక్ నేతృత్వంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా 66 మంది విద్యార్థులతో సహా పలువురు పెద్దలను కూడా పరిశీలించింది. వారం రోజులపాటు వారి కమ్యూనికేషన్‌లను ట్రాక్ చేసింది. ఈ సందర్భంగా తేలిందేమిటంటే.. టెక్స్ట్ సందేశాలలో 10% కంటే ఎక్కువ అబద్ధాలు ఉన్నాయి. అయితే ఫోన్ కాల్స్‌ మాట్లాడేటప్పుడు ఇవి 5% కంటే తక్కువగా ఉండగా, ముఖాముఖి సంభాషణలలో అబద్ధాలు చెప్పే శాతం ఇంకా చాలా వరకు తగ్గింది.

ఓవరాల్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్‌తో పోలిస్తే ఆన్‌లైన్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాట్సాప్ ఛాటింగ్‌లు, అదర్ డిజిటల్ కమ్యూనికేషన్‌లు ఏవైనా సరే.. అబద్ధాలు చెప్పే ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నదని అధ్యయనం స్పష్టం చేసింది. అయితే టెక్ట్సింగ్‌లో తక్షణ అభిప్రాయం, ‘నాన్ వెర్బల్ క్యూస్’ లేకపోవడం వల్ల అబద్ధం చెప్పడాన్ని ప్రజలు తక్కువ అపరాధభావంగా, ఎక్కువగా కంఫర్ట్‌గా(Feels less personal and more separate) భావిస్తారు. కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడే సందర్భం కంటే.. ఛాటింగ్ లేదా టెక్ట్సింగ్‌లలో అబద్ధాలు చెప్పే చాన్సెస్ ఎక్కువ.

Next Story