- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిదండ్రుల వ్యాయామ, వ్యక్తిగత ఆరోగ్యమే పిల్లల సూపర్ పవర్..!
సాధారణంగా తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకు వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. అయితే వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోనూ ఇది వర్తిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకు వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. అయితే వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోనూ ఇది వర్తిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే పేరెంట్స్ హెల్తీ హాబిట్స్, వారు చేసే వ్యాయామం కేవలం వారి ఫిట్‌నెస్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని శాస్త్రీయ ఆధారాలు పేర్కొంటున్నాయి. మానవులు, జంతువుల్లో కూడా ఇది జరుగుతుందని, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేసే వ్యక్తుల స్పెర్మ్ లేదా గర్భాశయ పరిస్థితులు ఎపిజెనెటిక్ మార్పుల ద్వారా మెరుగు పడతాయని ఈ ఏడాది అక్టోబర్‌లో Cell Metabolism జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది. దీనిని నాన్కింగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించారు.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించారు. వాటిని ఆరోగ్యం, శారీరక శ్రమ విషయంలో ముందుగానే ప్రిపేర్ చేశారు. అయితే 8 వారాలు ట్రెడ్‌మిల్ వ్యాయామం చేసిన మగ ఎలుకల వల్ల కలిగిన సంతానం, అలా చేయని మగ ఎలుకల సంతానంతో పోలిస్తే 50% ఎక్కువ పరుగెత్తగలిగాయని పరిశోధకులు నిర్ధారించారు. పైగా గ్లూకోజ్ సహన శీలత (Glucose tolerance), ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగైంది. ఈ ఎలుకలకు హై-ఫ్యాట్ డైట్ ఇచ్చినా ఊబకాయం రాలేదు. అలాగే వాటి స్పెర్మ్‌లో 10 మైక్రో ఆర్‌ఎన్‌ఏలు పెరిగాయి
ఆడ ఎలుకల విషయంలోనూ ఇది వర్తించిననట్లు పరిశోధకులు గుర్తించారు. గర్భధారణకు ముందు తల్లి ఆరోగ్యం, చేసే వ్యాయామం సంతానంలో ఇన్సులిన్ సిగ్నలింగ్ మెరుగుదలకు దోహదం చేస్తుందని, జన్యు వ్యక్తీకరణ కూడా పెరుగుతుందని కనుగొన్నారు. కాగా ఇది ఎలుకల మధ్య మాత్రమే కాదు, మానవులకూ వర్తిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యం అందించాలంటే వారి పేరెంట్స్ వ్యక్తిగత ఆరోగ్యం, శారీరక శ్రమ వంటివి కలిగి ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. Link






