Mental Health : యుక్త వయసులో ఆ గందరగోళం.. అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమిదే..!

by Javid Pasha |   (  Updated:2025-08-30 11:22:08  IST  )

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రిపోర్ట్ ప్రకారం.. మూడింట ఒకవంతు టీనేజ్ అమ్మాయిలు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Mental Health : యుక్త వయసులో ఆ గందరగోళం.. అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమిదే..!
X

దిశ, ఫీచర్స్ : యు‌క్త వయసు అంటేనే ఉరకలెత్తే ఉత్సాహం అంనుకుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగానూ మారుతున్నాయ్.. యుక్త వయసులో ఉల్లాసంగా, ఉత్సాహంగానే ఉంటున్నారన్న గ్యారెంటీ లేదు. ఈ ఏజ్ యువతీ యువకులు సైతం తీవ్రమైన ఒత్తిడులను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు మరింత ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) రిపోర్ట్ ప్రకారం.. మూడింట ఒకవంతు టీనేజ్ అమ్మాయిలు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదే సందర్భంలో స్వీయ-హాని (self harm) రేట్లు సైతం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవి ప్రధానంగా సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపులు, సమాజం నుంచి ప్రత్యక్షంగా ఎదురవుతున్న సమస్యల రూపంలో ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక జనరేషన్- Z అమ్మాయిలైతే ఇంతకుముందెన్నడూ లేనంతగా భావోద్వేగ ఒత్తిళ్లకు గురవుతున్నారు.

అన్ రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్స్(unrealistic beauty standards), ఆన్‌లైన్ హింస, విద్యాపరమైన ఒత్తిళ్లు, కుటుంబ పరంగా, సమాజ పరంగా జెండర్ ఇనిక్వాలిటీ వంటివి అమ్మాయిల్లో మానసిక సంక్షోభానికి, ఒత్తిళ్లకు దారితీస్తున్నట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు సరైన సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మహిళలపట్ల ఉన్న మూసధోరణులు, జెండర్ పరమైన వివక్షలకు సంబంధించిన కంటెంట్‌ను నివారించే వ్యవస్థ వంటివి ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

Next Story