ప్రియమైన వ్యక్తి నిర్లక్ష్యం, శారీరక నొప్పితో సమానం..! మెదడుపై కూడా ఎఫెక్ట్..!!

by Javid Pasha |   (  Updated:2025-11-06 07:28:35  IST  )

ప్రియమైన వ్యక్తి నిర్లక్ష్యం, శారీరక నొప్పితో సమానం..! మెదడుపై కూడా ఎఫెక్ట్..!!
X

దిశ, ఫీచర్స్ : ప్రశంసలు కొన్నిసార్లు అలంకారాలుగా పనిచేస్తుంటాయి. వ్యక్తుల్లో ఆనందాన్ని కలిగిస్తుంటాయి. కానీ సామాజిక తిరస్కారాలు లేదా ప్రియమైన వ్యక్తి నుంచి ఎదుర్కొనే రిజెక్షన్స్ మాత్రం అందుకు భిన్నమైన ప్రభావం చూపుతుంటాయి. ఇవి చాలా వరకు మనుషుల్ని కృంగదీస్తుంటాయి. మానసిక వేదనకు గురిచేస్తుంటాయి. అయితే ఈ ప్రభావం మెదడు ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదెలాగో చూద్దాం పదండి!

సోషల్ రిజెక్షన్ అంటే..?

మన ఇష్టాలకు వ్యతిరేకంగా సామాజికంగా ఎదురయ్యే తిరస్కరణలను సోషల్ రిజెక్షన్స్ అంటారు. మనం మనకు ఆత్మీయులుగా లేదా విలువైన వారిగా భావించే వ్యక్తి మనల్ని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం ఇందులో భాగమే. అలాగే ప్రియమైన వ్యక్తి మాట్లాడకపోవడం, తరచుగా తిరస్కరించడం, మీ స్నేహితులు మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వకపోడం, పార్టీలకు పిలవకపోవడం, లవ్ ఫెయిల్యూర్ వంటివి కూడా ఇందులో భాగంగా నిపుణులు పేర్కొ్ంటారు. అయితే ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్నే కాదు, బ్రెయిన్ హెల్త్‌ను కూడా ప్రభావితం చేస్తాయని మనస్తత్వ శాస్త్ర పరిశోధనలు (Psychological research) సూచిస్తున్నాయి.

ఎందుకలా జరుగుతుంది?

ప్రొసీడింగ్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్(PNAS) సహా పలు ఇతర పరిశోధనల ప్రకారం కూడా.. మనకు చాలా విలువైన వ్యక్తి మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే సందర్భాలు(Example: Someone ignoring us) శారీరక నొప్పికి సమానమైన మెదడు ప్రతిస్పందనను రేకెత్తిస్తాయి. అంటే సామాజిక తిరస్కారం, ఫిజికల్ పెయిన్ రెండు కూడా మెదడులోని యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (ACC) ప్రాంతాలను యాక్టివేట్ చేస్తాయి. దీని వల్ల రెండింటిలోనూ సమానమైన బాధ, ఆవేదనా భరితమైన అనుభూతి (Pain and sorrow are felt) కలుగుతుంది. ఎందుకంటే.. ఈ మెదడు ప్రాంతాలు బాధ లేదా ఆవేదనకు ‘అలారం’ వంటివి. కాబట్టి సామాజిక తిరస్కారం లేదా శారీరక నొప్పి ఈ రెండింటిలోనూ యాక్టివేట్ అవుతుంది. పలు న్యూరోఇమేజింగ్ అధ్యయనాలు ఈ రెండు మెదడు ప్రాంతాలు ప్రియమైన వ్యక్తి నుంచి ఎదురయ్యే తిరస్కారాన్ని లేదా సామాజిక తిరస్కారాన్ని, శారీరక నొప్పిని ఒకే విధంగా ప్రాసెస్ చేస్తాయని నిరూపించాయి.

Next Story