Health : లోన్లీనెస్‌తో తగ్గుతున్న దీర్ఘాయుష్షు.. మహిళలపైనే ప్రభావం ఎక్కువ!

by Javid Pasha |

శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. దీర్ఘకాలిక ఒంటరితనం ఉన్న స్త్రీల శరీరంలోని కణాల చివర ఉండే ‘టెలోమియర్స్’.. అంటే డీఎన్ఏలోని రక్షణ కవచం లాంటి కణాలు చాలా త్వరగా కుంచించకుపోతాయి

Health : లోన్లీనెస్‌తో తగ్గుతున్న దీర్ఘాయుష్షు.. మహిళలపైనే ప్రభావం ఎక్కువ!
X

దిశ, ఫీచర్స్ : లోన్లీనెస్.. ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సైలెంట్ కిల్లర్ ఇది. వ్యక్తిగత సమస్యలు, సామాజిక అంశాలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు వంటివి ఇందుకు కారణం అవుతుంటాయి. ఏది ఏమైనా ఒంటరి తనం మనిషిని మానసికంగా కృంగదీస్తుంది. చాలామంది కొంతకాలానికి రియలైజ్ అవుతుంటారు. కానీ ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా దీర్ఘాయుష్షును తగ్గిస్తుంది. పురుషులకంటే ఈ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటోందని Biodemography and Social Biology జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొంటున్నది.

డీఎన్ఏ‌లో మార్పు కూడా..

కేవలం మానసిక బాధ మాత్రమే కాదు. లోన్లీనెస్ శరీరంలోని డీఎన్ఏ(DNA)ను నేరుగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. దీర్ఘకాలిక ఒంటరితనం(Chronic loneliness) ఉన్న స్త్రీల శరీరంలోని కణాల చివర ఉండే ‘టెలోమియర్స్’(telomeres), అంటే డీఎన్ఏలోని రక్షణ కవచం లాంటి కణాలు చాలా త్వరగా కుంచించకుపోతాయి. ఇవి ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటే, శరీరం అంత యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే అవి కుంచించుకుపోవడం లేదా తగ్గిపోవడం ప్రారంభమైతే అప్పుడు వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. అంటే ఒంటరితనం అక్షరాలా మహిళల జీవిత కాలాన్ని తగ్గిస్తుందన్నమాట!

మహిళలపై అధిక ప్రభావం

లోన్లీనెస్ ప్రభావం పురుషులకంటే మహిళలపై ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే.. సహజంగానే మహిళలు సంబంధాల భావోద్వేగా సంబంధాలపై. పైగా ఇక్కడ ఆక్సిటోసిన్ హార్మోన్ కీ రోల్ పోషిస్తుంది. అదే విధంగా జీవితంలో హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ, పిల్లల పెంపకం వంటి బాధ్యతల విషయంలో గృహిణులైనా, ఉద్యోగస్తులైనా ఎక్కువగా మహిళలే సఫర్ అవుతుంటారు. స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, రోగ నిరోధక శక్తి తగ్గి, టెలోమియర్స్ కణాలు త్వరగా క్షీణిస్తాయి. కాబట్టి లోన్లీనెస్ మహిళలను ఎక్కువ ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

పరిష్కారం ఏమిటి?

మానసిక ఒత్తిడికి, ఒంటరి తనానికి దారితీసే పరిస్థితుల నుంచి బయటపడటమే చక్కటి పరిష్కారం. అర్థం చేసుకునే కుంటుంబం, స్నేహితులు, సామాజిక పరిస్థితులు మరింత మేలు చేస్తాయి. సంతోషంగా గడిపే ప్రతీ క్షణం టెలోమియర్స్‌ను కాపాడుతుంది. బయోలాజికల్ ఏజింగ్‌ను నెమ్మదిస్తుంది. అందుకే స్నేహం, ప్రేమ, ఎమోషనల్ సపోర్ట్ అందించే కుటుంబం చాలా ముఖ్యం. పురుషులకంటే మహిళలకు ఇవి ఇంకా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది కేవలం మనసుకు ఆనందం ఇచ్చే విషయం మాత్రమే కాదని, శాస్త్రీయంగా నిరూపితమైన “యాంటీ-ఏజింగ్ మెడిసిన్” లాంటిదని చెబుతున్నారు.

Next Story