- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మ గొంతు వినబడితే చాలు.. తగ్గుతున్న ఆందోళన, ఒత్తిడి.. అధ్యయనంలో వెల్లడి
మీరు ఎంత ఒత్తిడిలో, ఎంత నిరాశలో, ఎంత బాధలో ఉన్నా సరే.. అమ్మతో కేవలం 30 సెకన్ల సంభాషణ మొత్తం మానసిక స్థితినే మార్చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

దిశ, ఫీచర్స్ : ‘ప్రపంచమంతా ఒక్కటై నిన్ను వెంటాడుతుంటే.. నీకోసం నిలబడే వ్యక్తి అమ్మ. నిరాశలో కూరుకుపోయి నువ్వు తండ్లాడుతుంటే ఆశల హరివిల్లయ్ నిన్ను తీర్చిదిద్దే మహా మనిషి అమ్మ’ అంటుంటారు పెద్దలు.. నిపుణులు. అంతేకాదండోయ్ మీరు ఒక దీర్ఘమైన అలసటను అనుభవించిన తర్వాత, ఆందోళన, ఒత్తిడితో కుంగిపోతున్నప్పుడు కూడా అమ్మ పలకరింపు మీకు కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇస్తుందని, అమ్మ ఫోన్‌కాల్ మీలోని అన్ని సమస్యలను దూరం చేస్తుందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. అమ్మ స్వరం వినగానే కలిగే అనుభూతి అందుకు ప్రధాన కారణమని స్పష్టం చేస్తున్నాయి.
అవును.. తల్లి గొంతు వినడం (Hearing mother's voice) కూడా నిరాశను పారద్రోలే ఒక ఆలింగనం వంటి అనుభూతిని కలిగిస్తుందని విస్కాన్సిన్ - మాడిసన్ యూనివర్సిటీలోని చైల్డ్ ఎమోషనల్ ల్యాబ్ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. అమ్మ సౌమ్యమైన(Gentle) సుపరిచితమైన ( familiar) స్వరం ఒత్తిడిని తగ్గించి, మనసును శాంతపరుస్తుందని పేర్కొన్నది. ముఖ్యంగా తల్లి స్వరం బిడ్డలోని ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించి, ఆక్సిటోసిన్ (The hormone that brings bonding and peace)ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ప్రభావం శిశువుకు తల్లి ఆలింగనం కలిగించిన భరోసా, ఆత్మ విశ్వాసం, ధైర్యం వంటి అనుభూతిని కలిగిస్తుంది.
మీరు ఎంత ఒత్తిడిలో, ఎంత నిరాశలో, ఎంత బాధలో ఉన్నా సరే.. అమ్మతో కేవలం 30 సెకన్ల సంభాషణ మొత్తం మానసిక స్థితినే మార్చేస్తుందని, ఒత్తిడిని తగ్గించి, భద్రతా భావాన్ని పునరుద్ధరిస్తుందని అధ్యయనం పేర్కొన్నది. అంతేకాకుండా తల్లితో తరచుగా మాట్లాడుతూ ఉండే సంతానంలో ధైర్యం, ఆత్మ విశ్వాసం, సానుకూల ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే టెక్ట్స్ సందేశాలు మాత్రం ఈ విధమైన భావోద్వేగ ప్రభావాన్ని అందించలేవని, అవి అమ్మ స్వరం వంటి సానుభూతిని, వెచ్చదనాన్ని కలిగి ఉండవని కూడా అధ్యయనం తెలిపింది. అందుకే మీరు తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడో, నిరాశలో కూరుకుపోయినప్పుడో ఒక్కసారి అమ్మను పలకరించండి. లేదా అమ్మకు కాల్ చేసి మాట్లాడండి.. తేలికైన మనసుతో ప్రశాంతతను అనుభవిస్తారు అంటున్నారు నిపుణులు. Link






