- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బరువు తగ్గాలంటే వ్యాయామాలే సరిపోవు..! నిద్రపోవడం ముఖ్యం
తక్కువ నిద్ర పోవడం వల్ల ఎక్కువ ఆకలి వేయడం, రకరకాల ఆహారాపై కోరికలు పెరగడం, బరువు తగ్గకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో అనేకమంది ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఇది డయాబెటిస్, గుండె జబ్బులు వంటి రోగాలకు కారణం అవుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అందుకోసం బాధితులు ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం, ఆహార నియమాలు పాటించడం చేస్తుంటారు. అయితే బరువు తగ్గడంలో ఇవి మాత్రమే సరిపోవు. నిద్ర కూడా కీ రోల్ పోషిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ చికాగో నిపుణుల అధ్యయనం వెల్లడించింది.
*అధ్యయనంలో భాగంగా నిపుణులు కొంతమంది పెద్దలను ఎ, బి అనే రెండు గ్రూపులుగా విభజించారు. ఒకే కేలరీ-నియంత్రిత ఆహారం తీసుకుంటూ ఉండే క్రమంలో, వారి నిద్ర సమయాలను మారుస్తూ 14 రోజులపాటు అబ్జర్వ్ చేశారు. ఇందులో గ్రూప్ ఎ రాత్రి 8.5 గంటలు నిద్రపోయారు. అలాగే గ్రూప్ బి రాత్రి 5.5 గంటల సమయం మాత్రమే నిద్రపోయారు. 14 రోజుల తర్వాత ఫలితాలను విశ్లేషించగా 8.5 గంటలు నిద్రపోయిన గ్రూప్‌లోని వ్యక్తులు రెండు రెట్లు ఎక్కువ శరీర కొవ్వును తగ్గించుకున్నారు. ఇక 5.5 గంటలపాటు మాత్రమే నిద్రపోయిన గ్రూప్ కొవ్వు కంటే కండరాలు ఎక్కువగా కోల్పోయారు.
*తక్కువ నిద్ర పోవడం వల్ల ఎక్కువ ఆకలి వేయడం, రకరకాల ఆహారాపై కోరికలు పెరగడం, బరువు తగ్గకపోవడం కనిపించింది. అంతేకాకుండా దీనివల్ల శరీరంలో కొవ్వు నిల్వ (The hunger hormone ghrelin) పెరుగుతుంది. సంతృప్తికి కారణమైన లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి కొవ్వు నిల్వకు దారితీస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. అంతే మొత్తానికి శరీరానికి సరైన నిద్రలేకపోయే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే కూడా అధిక బరువు తగ్గరు. ఆహారం నియంత్రించినప్పటికీ, వ్యాయామాలు చేసినప్పటికీ బరువు పెరుగుతారు. కాబట్టి తగినంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. Link






