Health : కుక్కలను ముద్దు పెట్టుకుంటున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయ్ జాగ్రత్త!

by Javid Pasha |   (  Updated:2025-09-22 06:27:18  IST  )

50% మంది కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల యజమానులు వాటిని ముద్దు పెట్టుకోవడంవల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరి సంక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు

Health : కుక్కలను ముద్దు పెట్టుకుంటున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయ్ జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : మనుషులు కేవలం ఇతర మనుషులతో మాత్రమే కాదు, జంతువులతో, పక్షులతో, ప్రకృతితో అనుబంధం కలిగి ఉంటారు. వాటిపట్ల జాలి, దయ, ప్రేమ, కరుణ వంటివి కనబరుస్తుంటారు. ఇక పెట్‌ డాగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల చాలామంది కుక్కలను పెంచుకుంటున్నారు. వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. అంతేకాకుండా వాటిని ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం వంటివి కూడా కొందరు చేస్తుంటారు. అయితే ఇక్కడే ఓ ప్రమాదం పొంచి ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కుక్కలనుముద్దు పెట్టుకోవడం వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతున్నాయి.

నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం 50% మంది కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల యజమానులు వాటిని ముద్దు పెట్టుకోవడంవల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరి సంక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాటి నోటిలోని లాలాజంలో హానికరమైన బ్యాక్టీరియాలు, పరాన్న జీవులు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కుక్కలతో పాటు పిల్లులు, ఇతర పెంపుడు జంతువులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఇలా పెంపుడు జంతువులను కిస్ చేయడంవల్ల వ్యాధుల బారిన పడటాన్ని జూనోటిక్ ట్రాన్స్‌మిషన్ అంటారు. అంటే ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాధులను సంక్రమింపజేస్తుంది.

పెట్ డాగ్స్‌‌ను ముద్దు పెట్టుకునేటప్పుడు నోరు శుభ్రంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. వాటి నోటిలో సాల్మొనెల్లా, పాస్ట్యూరెల్లా, బార్టోనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇవి మానవులలో జీర్ణాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఇతర తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతారు. కాబట్టి పెట్ డాగ్స్ కానీ, ఇతర పెంపుడు జంతువులను కాని ముద్దు పెట్టుకోవడం వాటితో మరీ సన్నిహితంగా ఉండటం తగదంటున్నారు నిపుణులు. Link

Next Story