- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health Tips : అధిక చక్కెరతో పెరుగుతున్న డిప్రెషన్.. పురుషుల్లో 23% ఎక్కువ!
ఒక అధ్యయనం ప్రకారం అధిక చక్కెర తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో డిప్రెషన్ ప్రమాదాన్ని 23% పెంచుతుంది.

దిశ, ఫీచర్స్ : మనం తీసుకునే ఆహారాలే చాలా వరకు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అలాంటి వాటిలో అధిక చక్కెరలు కలిగిన పదార్థాలు, పానీయాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని అధికంగా తీసుకుంటే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్వీట్స్, చాక్లెట్లు, కేకులు, సోడా, జ్యూస్‌లు వంటి హై షుగరింగ్ పదార్థాల నుంచి వచ్చే రిఫైన్డ్ చక్కెర (సుక్రోజ్, ఫ్రక్టోజ్) మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి తరచుగా వీటిని తీసుకోవడం అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో పబ్లిషైన గత అధ్యయనం ప్రకారం కూడా అధిక చక్కెర తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో డిప్రెషన్ ప్రమాదాన్ని 23% పెంచుతుంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు సైతం హై షుగరింగ్ పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని తేల్చారు. అధ్యయనంలో భాగంగా 8,000 మందికి పైగా 5 సంవత్సరాల పాటు వారి ఆహారపు అలవాట్లను, ముఖ్యంగా అధిక చక్కెరలు తీసుకోవడం వారి మానసిక ఆరోగ్యాన్ని (Common Mental Disorders - CMD, Depression) ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మానిటర్ చేశారు.
పరిశోధకుల అధ్యయనంలో చక్కెర తక్కువ తీసుకున్నవారితో పోలిస్తే.. రోజుకు 67 గ్రాములకు పైగా తీసుకున్న పురుషులకు 5 సంవత్సరాల తర్వాత కామన్ మెంటల్ డిజార్డర్ (CMD) ప్రమాదం 23% అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఇది మహిళల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయమై మాత్రం అధ్యయనం పరిశీలించలేదు. కానీ మొత్తంగా అధిక చక్కెరలు తీసుకోవడం స్త్రీ, పురుషులు ఎవరికైనా రిస్కేనని, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
తరచుగా తీసుకోవడంవల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది. సెరోటోనిన్, డోపమైన్ వంటి మూడ్ రెగ్యులేటర్ న్యూరోట్రాన్స్‌మిటర్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. శారీరకంగా కూడా డయాబెటిస్, ఒబేసిటీ వంటి వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 40 గ్రాములకంటే తక్కువ చక్కెర తీసుకోవాలని సూచిస్తున్నారు. డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం మొత్తం క్యాలరీలలో 5-10% మాత్రమే చక్కెర ఉండేలా చూసుకోవాలి. అంతకు మించితే ప్రమాదం. Link






