- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : చాలామందికి ఆ సమయంలోనే హార్ట్ ఎటాక్..! ఎందుకిలా జరుగుతుంది?
మిగతా సమయాలతో పోలిస్తే, ఉదయం పూట మాత్రమే గుండెపోటు సంభవించే రిస్క్ ఎక్కువ!

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న లక్షలాదిమంది మరణాలకు గల ప్రధాన కారణాల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒకటి. అయితే బాధితుల్లో చాలామంది ఉదయంపూట మాత్రమే దీని బారిన పడుతుంటారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మిగతా సమయాలతో పోలిస్తే కేవలం మార్నింగ్ హవర్స్‌లోనే 20 నుంచి 40% హార్ట్ ఎటాక్స్ సంభవిస్తుంటాయని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ(ESC) స్టడీ సైతం పేర్కొన్నది. శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) ఇందుకు కారణం అవుతుందని కూడా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సిర్కాడియన్ రిథమ్ అనేది నిజానికి సహజమైన, అంతర్గత శారీరక ప్రక్రియ అని, ఇది నిద్రపోవడం, మేల్కోవడం వంటి శరీర ధర్మాన్ని నిర్వర్తించడంలో, నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు ఇది ప్రతీ 24 గంటలకు పునరావృతం అవుతూ ఉంటుంది. అంటే.. శరీర గడియారంగా పనిచేస్తూ రక్తపోటు, హార్మోన్ల స్థాయిలు, గుండె పనితీరును నియంత్రిస్తుంది. ఈ ప్రాసెస్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సహజంగానే రక్తపోటు, ఒత్తిడి హార్మోన్ (Cortisol) స్థాయిలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
రక్తం గడ్డకట్టే సామర్థ్యం కూడా ఉదయంపూట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలను విశ్లేషించిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంశ పారంపర్యంగా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువని చెబుతున్నారు. అందుకే ఉదయం పూట ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం (Center or left), శ్వాస ఆడకపోవడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, వికారం, మైకం, లేదా భుజం, చేయి, దవడ, వీపు భాగాల్లో నొప్పి వంటి లక్షణాలు క్రమంగా పెరుగుతూ ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






