- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heart attack: ఆ సమయంలోనే గుండెపోటుకు గురౌతున్న బాధితులు.. కారణం ఇదేనా?
Heart attack: ఆ సమయంలోనే గుండెపోటుకు గురౌతున్న బాధితులు.. కారణం ఇదేనా?

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న లక్షలాదిమంది మరణాలకు ప్రధాన కారణాల్లో గుండెపోటు కూడా ఒకటి. అయితే బాధితుల్లో అత్యధికమంది ఉదయంపూటే దీని బారిన పడుతుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు మొత్తంలో మిగతా సమయంతో పోలిస్తే కేవలం మార్నింగ్ సమయంలోనే 20 నుంచి 40% హార్ట్ ఎటాక్స్ సంభవిస్తుంటాయని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ(ESC) స్టడీ కూడా పేర్కొన్నది. శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) అందుకు ప్రధాన కారణమని పలు ఇతర అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. ఎందుకలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సిర్కాడియన్ రిథమ్ అనేది వాస్తవానికి శరీర సహజమైన, అంతర్గత ప్రక్రియ. ఇది నిద్రపోవడం, మేల్కోవడం వంటి శరీర ధర్మాన్ని నిర్వర్తించడంలో, నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతీ 24 గంటలకు పునరావృతం అవుతూ ఉంటుంది. అంటే శరీర గడియారంగా పనిచేస్తూ రక్తపోటు, హార్మోన్ల స్థాయిలు, గుండె పనితీరును నియంత్రిస్తుంది. ఈ ప్రాసెస్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సహజంగానే బ్లడ్ ప్రెజర్, స్ట్రెస్ హార్మోన్ (Cortisol) స్థాయిలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి.
రక్తం గడ్డకట్టే సామర్థ్యం కూడా ఉదయంపూట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వంశ పారంపర్యంగా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయం పూట ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం (Center or left), శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, వికారం, మైకం, లేదా భుజం, చేయి, దవడ, వీపు భాగాల్లో నొప్పి వంటి లక్షణాలు క్రమంగా పెరుగుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






