- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది తెలుసా..? అబ్బాయిలకంటే.. అమ్మాయిలే తెలివైనోళ్లు..! ఎందుకంటే..
ఇది తెలుసా..? అబ్బాయిలకంటే.. అమ్మాయిలే తెలివైనోళ్లు..! ఎందుకంటే..

దిశ, ఫీచర్స్ : సేమ్ ఏజ్ కలిగిన అబ్బాయిలతో పోలిస్తే, అమ్మాయిలే కొంచెం ఎక్కువ తెలివైన వాళ్లుగా ఉంటారనే విషయం మీకు తెలుసా? తాజా అధ్యయనం అదే చెబుతోంది. బాలుర మెదడుకంటే బాలికల మెదడు వేగంగా పరిణతి(mature)చెందడమే ఇందుకు కారణమని పేర్కొన్నది. ముఖ్యంగా భావోద్వేగ నియంత్రణ, నిర్ణయాధికారం, సెల్ఫ్ కంట్రోల్ విషయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని న్యూకాసిల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 120 మంది బాలురు, బాలికల మెదడు స్కాన్‌లను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, బాలికల మెదడులోని కీలకమైన ప్రాంతాలలో నాడీ(neural connections) సంబంధాలు బాలురకంటే కూడా 1 నుంచి 2 సంవత్సరాలు ముందుగా అభివృద్ధి చెందడమే ఈ పరిస్థితికి కారణమి కనుగొన్నారు.
అమ్మాయిలు, అబ్బాయిల తెలివితేటలకు సంబంధించి వీరి మెదడు పరిపక్వత విషయంలో అసమానతలు ఎల్లప్పుడూ ఉండవు. కాకపోతే ఒకటి రెండేళ్లు ముందుగా అమ్మాయిల బ్రెయిన్ మెచ్యూర్ అవతుందని పరిశోధకులు గుర్తించారు. అబ్బాయిలు మెదడు కూడా పరిపక్వత చెందే వరకు ఈ వ్యత్యాసం కనిపిస్తున్నట్లు కనుగొన్నారు. పరిశోధన ప్రకారం బాలికల మెదడులో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, అమిగ్డాలా వంటి భావోద్వేగ నియంత్రణ, అలాగే నిర్ణయాధికారంతో ముడిపడిన భాగాలు త్వరగా పరిపక్వం అవుతాయని పేర్కొన్నారు.
అమ్మాయిల మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్, అమిగ్డాలా వంటి భాగాలు త్వరగా పరిణతి చెందడంవల్ల సామాజిక పరస్పర చర్యలు(Social interactions), సమస్య పరిష్కారం, దీర్ఘకాలిక ఆలోచనలను నియంత్రించడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. ఇక అబ్బాయిల్లో మెదడులోని ఈ ప్రాంతాలు అభివృద్ధి కావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. అమ్మాయిలతో పోలిస్తే తక్కువ మెచ్యూర్డ్‌గా అనిపించే ప్రవర్తనకు ఇది కూడా ఒక కారణమని పరిశోధకులు అంటున్నారు. అలాగే యుక్త వయసులో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువ ఆత్మ నిగ్రహంగా ఉండటానికి, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి కూడా ఇదే కారణమని పరిశోధకులు చెబుతున్నారు.






