- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రొటీన్ వ్యాయామాలే కాదు.. గార్డెనింగ్‌తోనూ ఆనందం.. ఆరోగ్యం..!
వ్యాయామాలు చేయడానికి సమయం లేనివారు గార్డెనింగ్, నేచర్ కనెక్టివిటీ వంటివి ఫాలో అయితే ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయని. మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ చేసే రొటీన్ వ్యాయామాలనే ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేచర్ కనెక్టివిటీ, గార్డెనింగ్ వంటివి కూడా అలాంటి ప్రయోజనాలు చేకూర్చుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. Journal of Health Psychology అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నది. ముఖ్యంగా డైలీ ఉదయాన్నే ఎక్సర్‌సైజ్ చేయడానికి టైమ్ లేనివారు ఇది ఫాలో కావచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఇలా చేయడంవల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయని. మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
*గార్డెనింగ్‌లో తవ్వడం, నాటడం, కలుపు తీయడం వంటి పనులు శారీరక శ్రమను అందిస్తాయి. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
*మట్టితో పనిచేయడం వల్ల శరీరం సూక్ష్మజీవులకు గురవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే గార్డెనింగ్ సమయంలో సూర్యరశ్మికి గురికావడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
*పెరటిలో లేదా మొక్కలతో సమయం గడపడం, ప్రకృతితో సన్నిహితంగా ఉండటం వంటి నేచర్ కనెక్టివిటీవల్ల కార్టిసాల్ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల మానసిక వికాసం కలుగుతుంది. అంతేకాకుండా గార్డెనింగ్ ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. మానసిక శాంతిని పెంపొందిస్తుంది.
*గార్డెన్ డిజైన్ చేయడం, మొక్కల సంరక్షణ చూసుకోవడం వంటివి సృజనాత్మక ఆలోచనలను, ఏకాగ్రతను పెంచుతాయి. ఇక కమ్యూనిటీ గార్డెనింగ్ వంటి పనుల్లో పాల్గొనేవారిలో వీటితోపాటు సామాజిక సంబంధాలు కూడా బలపడతాయి. లోన్లీనెస్, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాకుండా పర్యావరణపంట్ల బాధ్యత, స్థిరమైన జీవన శైలిపట్ల ఆసక్తి కూడా పెరుగుతాయి. ఇవన్నీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.






