- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kids &Parenting : పిల్లలపై తరచుగా అరుస్తున్నారా? జరిగేది ఇదే!
పిల్లలపై తరచుగా అరవడం, బెదిరించడం వారి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తర్వాత జీవితంలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కొనే చాన్స్ పెరుగుతుంది.

దిశ, ఫీచర్స్ : పిల్లలు మాట వినడం లేదనో, సరిగ్గా చదవడం లేదనో పేరెంట్స్ అరవడం, కోప్పడటం చేస్తుంటారు. కొన్నిసార్లు పిల్లల ఎదుటే గొడవపడటం కూడా చేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. కానీ ఎల్లప్పుడూ ఈ విధమైన ప్రవర్తనే కొనసాగుతుంటే అది చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ చైల్డ్ డెవలప్‌మెంట్, చైల్డ్‌హుడ్ వెర్బల్ అబ్యూజ్‌లలో పబ్లిషైన గత అధ్యయనాలు సైతం ఇదే పేర్కొంటున్నాయి. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.
నమ్మకాన్ని దెబ్బతీస్తుంది
పిల్లలపై తరచుగా అరవడం, బెదిరించడం, హెచ్చరించడం వల్ల వారు తర్వాత జీవితంలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడే చాన్స్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రశాంతమైన, ఎటువంటి హెచ్చరికలు, అరవడాలు లేకుండా పేరంటల్ సపోర్టివ్ వాతావరణంలో పెరిగిన పిల్లలతో పోలిస్తే, తరచుగా పేరెంట్స్ అరవడం, పిల్లల ముందు గొడవపడటం, పిల్లలకు భయం పెట్టాలన్న పేరుతో ఎక్కువగా కంట్రోల్ చేయడం వంటి ప్రవర్తన పిల్లల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ రిస్క్‌ను పెంచుతుంది. అంటే ఇక్కడ అరవడం కేవలం పిల్లల ప్రవర్తనను సరిద్దడానికి మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అది ఎక్కువైతే పిల్లలు మానసికంగా కృంగిపోతారు. తరచుగా ఈ విధమైన ప్రవర్తన పిల్లల మెదడును నిరంతరం స్ట్రెస్ స్థితిలో ఉంచుతుంది. అంతేకాకుండా ఇది పిల్లల ఎమోషనల్ డెవలప్‌మెంట్, స్వీయ-గౌరవం (self-esteem), వారి సురక్షితమైన వాతావరణంపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే.. తరచుగా అరవడం వల్ల పిల్లల మెదడులో భయాన్ని ప్రేరేపించే భాగం(amygdala) అతి చురుకుగా మారి, ఫైట్-ఆర్-ఫ్లైట్ స్పందనను పునరావృతం చేస్తుంది.
భావోద్వేగ నియంత్రణలో సమస్య..
అంతేకాకుండా పిల్లలపై అరవడం, కోప్పడటం దీర్ఘకాలం కొనసాగుతూ ఉండటంవల్ల వారిలో హార్మోన్ల అసమతుల్యత, భావోద్వేగ నియంత్రణలో సమస్యలు, తక్కువ ఆత్మవిశ్వాసం వంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా పిల్లలకు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచే అభద్రతా భావం, భయం అనేవి వస్తే.. వారు తమ ఇంటి వాతావరణాన్ని కూడా అసురక్షితంగా భావిస్తారు. ఇది దీర్ఘకాలికంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలతో మాట్లాడే విధానం చాలా ముఖ్యమని చెబుతున్నారు. క్రమ శిక్షణ అవసరమే కానీ.. దాని స్వరం (tone), స్థిరత్వం, ఎమోషనల్ సేఫ్టీ (emotional safety) కూడా అత్యంత ముఖ్యమైనవని పేరెంట్స్ గుర్తించాలంటున్నారు. నేడు పేరెంట్స్ పిల్లలతో ఎలా మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో రేపు అది వారి ఇన్నర్ వాయిస్‌గా మారి, ఆలోచనల్ని, ఆత్మ విశ్వాసాన్ని రూపొందిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా, ప్రేమతో మాట్లాడటం ద్వార పిల్లల్లో బలమైన సానుకూల మానసిక పునాది ఏర్పడుతుందని అంటున్నారు. అలాగే తరచుగా అవరవడం, కోప్పడటమనేది స్వల్ప కాలిక ఫలితాన్ని ఇచ్చినా. దీర్ఘకాలికంగా పిల్లలకు హానికరమని, అందుకే పేరెంట్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.






