నరాలను రిపేర్ చేసే ఇంజెక్టబుల్ జెల్.. ఆ విషయంలో ఢోకాలేదిక!

by Javid Pasha |

నరాల రిపేర్, రికవరీని మార్చగలిగే ఇంజెక్టబుల్ జెల్‌ను శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

నరాలను రిపేర్ చేసే ఇంజెక్టబుల్ జెల్.. ఆ విషయంలో ఢోకాలేదిక!
X

దిశ, ఫీచర్స్ : అనుకోని ప్రమాదాల్లో నరాలు తీవ్రంగా దెబ్బతిన్నా.. అనారోగ్యాల వల్ల బలహీన పడినా శరీరం- నరాల మధ్య కనెక్షన్‌ను పునరుద్ధరించడం చాలా కష్టం. కానీ ఈ సమస్యను సులభతరం చేసే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీశారు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు. నరాల రిపేర్, రికవరీని మార్చగలిగే ఒక ఇంజెక్టబుల్ జెల్‌ను డెవలప్ చేశారు. దీనినే ‘షీర్-థిన్నింగ్ హైడ్రోజెల్ (Shear-thinning Hydrogel)’ అని కూడా పిలుస్తున్నారు.

ఆపరేషన్లకంటే అద్భుతమైన ఫలితం!

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన రీజనరేటివ్ హైడ్రోజెల్స్ శరీరంతో సమానంగా ఉండే బయోకంపాటిబుల్ మెటీరియల్‌తో తయారవుతాయి. కాబట్టి వీటిని మెడికల్ ఫార్ములాలోకి మార్చి ఇంజెక్ట్ చేయడం ద్వారా దెబ్బతిన్న ప్రదేశంలో మృదువైన మూడ్-డైమెన్షనల్ స్కాఫోల్డ్‌గా మారి, నరాల కణాలు పెరగడానికి దోహదపడతాయని పరిశోధకులు అంటున్నారు. అంటే గతంలో స్టిచెస్ వేసి చేసే ఆపరేషన్లతో పోలిస్తే ఇవి తక్కువ నొప్పిని కలిగిస్తాయని, మంటను తగ్గించి రికవరీని వేగవంతం చేస్తాయని చెబుతున్నారు. పైగా ఈ ఇంజెక్టబుల్ జెల్స్ సాధారణంగా షీర్-థిన్నింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.

శరీరంలోకి వెళ్లాక ఏం జరుగుతుంది?

సూదిద్వారా ఇంజెక్ట్ చేసేటప్పుడు రీజనరేటివ్ హైడ్రోజెల్స్ ద్రవంలా ప్రవహిస్తాయి. శరీరంలోకి వెళ్లిన తర్వాత గట్టిపడి స్థిరమైన బ్రిడ్జ్‌గా మారుతాయి. దీంతో నరాల పునరుత్పాదనను ప్రోత్సహించడమే కాకుండా, ఫైబ్రోసిస్ (మచ్చ కణజాలం) ఏర్పడకుండా నిరోధించి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఈ బయోపాలిమర్ టెక్నాలజీలలో ఓ కంపెనీ అభివృద్ధి చేసిన Coaptium Connect సిస్టమ్ 2025లో FDA పొంది, ఇప్పటికే వాణిజ్యీకరణ మొదలైందని నిపుణులు చెబుతున్నారు. ఇది స్టిచెస్ లేకుండా నరాలను కలిపే అత్యాధునిక పద్ధతిగా పేర్కొంటున్నారు. అయితే షీర్-థిన్నింగ్ హైడ్రోజెల్ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉన్నప్పటికీ, దీని ఆధారంగా వచ్చిన టెక్నాలజీలు ప్రమాదాల్లో నరాలు దెబ్బతిన్న రోగులు, న్యూరాలజికల్ సమస్యలు ఉన్నవారికి కదలిక, సెన్సేషన్, జీవన నాణ్యతను మెరుగుపరచే అవకాశం ఇస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇంజెక్టబుల్ జెల్స్ నరాల పునరుద్ధరణ చికిత్సలో కీలక పాత్ర పోషించనున్నాయని పరిశోధకులు అంటున్నారు.

Next Story