- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలికాలంలో ఉదయపు ఎండ.. మీ బ్లడ్ ప్రెజర్‌ను త్గగిస్తుందని తెలుసా?
సూర్యకాంతికి గురైనప్పుడు UVA కిరణాలు చర్మ కణాల్లో నైట్రిక్ ఆక్సైడ్ (NO) విడుదల చేస్తాయి. ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజూ కాసేపు ఉదయం పూట లేలేత ఎండకు గురికావడం వల్ల విటమిన్ డి సహజంగానే లభిస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే అదే సందర్భంలో సూర్యకాంతి మీ బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుందని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని తెలుసా? ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ (University of Edinburgh) డెర్మటాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ వెల్లర్ (Richard Weller) నేతృత్వంలో జరిగిన పరిశోధనలు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాయి. సూర్యరశ్మి కేవలం మీ శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని చేయడం మాత్రమే కాకుండా, మానసిక స్థితిని, ఇమ్యూన్ సిస్టమ్‌ను, రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా బాడీలో హానికారక సూక్ష్మ జీవులను చంపే ప్రోటీన్లను అంటే యాంటీ మైక్రోబయల్ పె్టైడ్స్‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.
అనేక మెటా-ఎనాలిసిస్ అధ్యయనాలు (Example: 2017 BMJ meta-analysis) విటమిన్ D సప్లిమెంటేషన్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల రిస్క్‌ను తగ్గిస్తుందని నిరూపించాయి. అదే సమయంలో సూర్యకాంతికి గురైనప్పుడు UVA కిరణాలు చర్మ కణాల్లో నైట్రిక్ ఆక్సైడ్ (NO) విడుదల చేస్తాయి. ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ రక్తనాళాలను రిలాక్స్ చేసి అవి విస్తరించేలా(Vasodilation) చేస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం మెరుగుపడుతుంది. రక్తపోటు (blood pressure) తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు, చర్మ క్యాన్సర్ రిస్క్‌లను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం పూట 10 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండేలా చూసుకోవాలి. చలికాలంలో ఇది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.






