- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Risk with lipstick : లిప్‌స్టిక్ ఎక్కువగా వాడితే కిడ్నీలు దెబ్బతినొచ్చు..! ఇంకా ఆ సమస్యలు కూడా..
లిప్‌స్టిక్‌లోని కాడ్మియం అనే పదార్థం కిడ్నీలను దెబ్బ తీస్తుందని, రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లకు కారణం అవుతుందని కూడా పరిశోధకులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : అనేకమంది మహిళలు వినియోగించే ఆధునిక సౌందర్య ఉత్పత్తుల్లో లిప్‌స్టిక్ (Lipstick) ఒకటి. కొందరు ప్రత్యేక ఈవెంట్లు, ఫంక్షన్లు, బయటకు వెళ్లాల్సిన సందర్భాల్లో మాత్రమే యూజ్ చేస్తుంటారు. మరికొందరు రోజువారీ అలంకరణలో భాగంగానూ లిప్‌స్టిక్ వాడుతుంటారు. కానీ ఇలా రోజూ వాడటం ప్రమాదకరమని, మహిళల్లో కిడ్నీ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు సహా పలు అనారోగ్యాలకు అది కారణం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
హెలియాన్ జర్నల్(Helian Journal)- 2024, స్టడీ ప్రకారం.. ఘనాలో విక్రయించబడే 12 లిప్‌స్టిక్ నమూనాలను X-రే ఫ్లోరసెన్స్ (XRF) విశ్లేషణ ద్వారా పరిశీలించిన పరిశోధకులు వీటిలో కాడ్మియం స్థాయిలు FDA నిబంధనలు, పరిమితులకు భిన్నంగా 3 మి.గ్రా./కి.గ్రా. పరిమితిని మించాయని కనుగొన్నారు. ఈ స్థితిలో కాడ్మియం శరీరంలో కిడ్నీలను దెబ్బతీస్తుందని, దీర్ఘకాలిక బహిర్గతం ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్‌లకు దారితీస్తుందని పేర్కొ్న్నారు. 2013లో కాలిఫోర్నియాలో జరిగిన ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్ (Perspectives) అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
మొత్తానికి అధ్యయనాల ప్రకారం చాలా వరకు లిప్‌స్టిక్ బ్రాండ్లు, అలాగే షేడ్‌లలో కాడ్మియం అనే విషపూరిత పదార్థం మిక్స్ అయి ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. తద్వారా నరాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కాడ్మియం కిడ్నీలను దెబ్బ తీస్తుందని, రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లకు కారణం అవుతుందని కూడా పరిశోధకులు అంటున్నారు. అయితే ఒక అధ్యయనం ప్రకారం సగటు వినియోగదారులలో రోజుకు 24 మి.గ్రా. లిప్‌స్టిక్‌ను వాడుతన్నారు. ఇక ఎక్కువగా వాడేవారు 87 మి.గ్రా. యూజ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి లిప్ట్‌స్టిక్‌లోని కాడ్మియం శరీరంలోకి ప్రవేశించే అవకాశాన్ని పెంచి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. కాబట్టి తరచుగా వాడటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాలు నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link






