- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Social Media : సోషల్ మీడియా యువతలో ఒత్తిడిని పెంచుతుందా?.. నిపుణులు చెబుతున్నది ఇదే..!
Social Media : సోషల్ మీడియా యువతలో ఒత్తిడిని పెంచుతుందా?.. నిపుణులు చెబుతున్నది ఇదే..!

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టా, ఫేస్ బుక్, ఎక్స్, థ్రెడ్, వాట్సాప్, షేర్‌చాట్ వేదిక ఏదైతేనేం.. ఈరోజుల్లో సోషల్ మీడియాను యూజ్ చేయని వారు దాదాపు ఉండరు. అయితే యువత ఎక్కువ సమయం అందులో గడుపుతోందనే ఆరోపణలను తరచుగా ఎదుర్కొంటూనే ఉంటుంది. దీంతో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం మాత్రం సోషల్ మీడియాలో నిమగ్నమై ఉండటం యువతలో సంతోషాన్ని పెంచుతుందని, మానసిక ఒత్తిడిని దూరం చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నది.
సోషల్ మీడియాలో అన్నీ నిజాలే ఉండకపోవచ్చనే వాదనలు ఉన్నప్పటికీ, ఆకట్టుకునే కంటెంట్, న్యూస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ వంటివి యువతను ఆకట్టుకోవడం ద్వారా వారి ఆనందానికి కారణం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టీనేజర్స్, జెన్ టీ (Gen Z)లల్లో సోషల్ మీడియా స్ట్రెస్ లెస్ ఫీల్ కలిగిస్తుందని రీసెర్చర్స్ అంటున్నారు. స్టడీలో భాగంగా 2000 మందిని రెండు గ్రూపులుగా విభజించి ఆన్ లైన్ వేదికగా వివిధ టాస్క్‌లు సూచించడం ద్వారా చేసిన పరిశీలనలో ఈ విషయాలు వెల్లడైనట్లు నిపుణులు పరిశోధకులు పేర్కొన్నారు.
యువత సోషల్ మీడియాలో స్ర్కోల్ చేస్తున్నప్పుడు నమ్మదగిన లేదా ఆసక్తి రేకెత్తించే కంటెంట్ అని భావిస్తే వారు మరింత సంతోషంగా, ఎనర్జిటిక్‌గా ఫీలవుతారని, కంటెంట్ నమ్మకం లేనిదిగా, ఆసక్తి లేనిదిగా భావించినప్పుడు రకరకాల సందేహాలు తలెత్తడంతోపాటు ఒత్తిడి పెరుగుతుందని ప్రధాన పరిశోధకుడు అడమ్ హాఫ్మన్ పేర్కొన్నాడు. ‘సోషల్ మీడియా- మెంటల్ హెల్త్’పై గతంలోనూ పరిశోధనలు జరిగాయి. కానీ అవి మంచి-చెడు ప్రభావాలు ఉంటాయని మిశ్రమ ఫలితాలను కనుగొన్నాయి.
కొన్ని అధ్యయనాలు సొంత ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడానికి, సమాజం గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా సహాయపడుతుందని కూడా పేర్కొన్నాయి. మరికొన్ని అధ్యయనాలు ఇతరుల ద్వారా బెదిరింపులు ఎదుర్కోవడం, ఆత్మ న్యూనతా భావానికి గురవడంలో సోషల్ మీడియా ప్రభావం చూపిందని వెల్లడించాయి. తాజా అధ్యయనం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా సోషల్ మీడియా స్ట్రెస్ లెస్ ఫీల్ కలిగిస్తుందని, యువతలో సంతోషానికి, మానసిక వికాసాన కారణం అవుతుందని పేర్కొన్నది.






