ఇవి రెండు కలిపి తింటే.. క్యాన్సర్, గుండె జబ్బులు పరార్..! కారణమిదే..

by Javid Pasha |   (  Updated:2026-03-28 08:07:01  IST  )

టమాటో సల్సాతో 150 గ్రాముల అవకాడో జోడించి తినడంవల్ల లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను శరీరం 4.4 రెట్లు (440%) ఎక్కువగా గ్రహించినట్లు అధ్యయనంలో తేలింది.

ఇవి రెండు కలిపి తింటే.. క్యాన్సర్, గుండె జబ్బులు పరార్..! కారణమిదే..
X

దిశ, ఫీచర్స్ : మనం సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో టమాటో, అవకాడో కూడా ఒకటి. అయితే ఈ రెండింటిని కలిపి తినడంవల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుందని మీకు తెలుసా? ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్(The Journal of Nutrition)లో పబ్లిషైన ఒక అధ్యయనం ఇదే పేర్కొన్నది. స్టడీలో భాగంగా 11 మంది ఆరోగ్యవంతులను పరిశీలించినప్పుడు, టమాటో సల్సాతో 150 గ్రాముల అవకాడో జోడించి తినడంవల్ల లైకోపీన్ (lycopene)అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ను శరీరం 4.4 రెట్లు (440%) ఎక్కువగా గ్రహించినట్లు గుర్తించారు.

లైకోపీన్ అనేది టమాటోలలో సమృద్ధిగా ఉండే ఫ్యాట్-సాల్యూబుల్. అంటే కొవ్వులో కరిగే సమ్మేళం. అయితే ఇది కేవలం టమాటోలను తిన్నప్పుడు శరీరం లైకోపిన్‌ను తక్కువగా గ్రహిస్తుందని, అవకాడోతో కలిపి తింటే ఎక్కువగా గ్రహిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన మోనోఅన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ (healthy fats) ఈ విధంగా లైకోపీన్‌ను సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడతాయి. అందుకే రోజువారీ భోజనంలో టమాటో సాస్ లేదా సలాడ్ లేదా సూప్‌తో అవకాడో ముక్కలు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదని, లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ పెరగడంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి, గుండెజబ్బులు, క్యాన్సర్లు, ఇతర వ్యాధుల రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story