Benefits of Onions : వామ్మో.. ఉల్లిపాయలవల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తినడం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2025-06-01 07:56:22  IST  )

Benefits of Onions : వామ్మో.. ఉల్లిపాయలవల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తినడం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Benefits of Onions : వామ్మో.. ఉల్లిపాయలవల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తినడం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ‘‘కొన్నిసార్లు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’’ అంటుంటారు పెద్దలు. హెల్త్ పరమైన విషయాలకు వర్తింపజేస్తూ ఈ నానుడిని ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం నానుడి మాత్రమే అనుకునే.. అక్షరాల నిజమని కూడా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొంతకాలం గనుక ఆహారంలో భాగంగా ఉల్లిపాయలు తినడం ఆపేస్తే ఆరోగ్య పరంగా చాలా నష్టపోతారని కూడా చెబుతున్నాయి. తింటేనే మంచిదని, పచ్చి ఉల్లిపాయలు తినడం కూడా మంచిదేనని పేర్కొంటున్నాయి. ఎందుకు? ఎలాగో ఇప్పుడు చూద్దాం.

*ఉల్లిపాయలు వండినవి కానీ, లేదా పచ్చివి కానీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఉల్లిపాయలు (Allium cepa) విటమిన్లు, ఖనిజాలు, సల్ఫర్ సమ్మేళనాల(Sulfur compounds)ను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

*ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. తినడంవల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, ఆక్సీకరణ ఒత్తిడిని(Oxidative stress) తగ్గిస్తాయి. సల్ఫర్ సమ్మేళనాలు (Such as allium and allyl sulfide) యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

*పచ్చి ఉల్లిపాయలు లేదా ఆహారంలో భాగంగా వండిన లేదా ఉడకబెట్టినవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే అవి ఫైబర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అదనంగా తక్కువ కేలరీలను కలిగి ఉండటంవల్ల అధిక బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఉల్లిపాయల్లోని ఫైబర్ కంటెంట్ ఉపయోగపడుతుంది. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

*ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పే సైంటిఫిక్ ఆధారాలు అధ్యయనాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 2006లో ‘‘Journal of Nutrition’’లో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలలోని క్వెర్సెటిన్ రక్తపోటును, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 2015లో ‘American Journal of Clinical Nutrition’లో పేర్కొన్న స్టడీ ప్రకారం.. ఉల్లిపాయలలోని సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇవి పొట్ట, జీర్ణాశయ క్యాన్సర్‌ల రిస్క్‌ను తగ్గిస్తాయి. ఉల్లిపాయలలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు బాక్టీరియా ఇన్ఫెక్షన్‌లతో పోరాడటంలో సహాయపడతాయని కూడా 2010 నాటి ‘Journal of Food Science’ అధ్యయనం సూచించింది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఉల్లిపాయలను తప్పక తినాలంటున్నారు పోషకాహార నిపుణులు. తినడం మానేస్తే గనుక పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలను నష్టపోయే అవకాశం ఉంది. అయితే శరీర తత్వాన్ని బట్టి అన్ని ఆహారాలూ అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చు. కాబట్టి అలర్జీలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు నిపుణుల సలహాలను పాటించాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story