- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా..? ఎంత డేంజరో తెలుసా?
డిస్పోజబుల్ పేపర్ గ్లాసుల్లో టీ, కాఫీ వంటివి తాగడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి ప్రవేశించి, అవయవాలలో పేరుకుపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : టీ, కాఫీ, పాలు, పండ్ల రసాలు, ఇతర పానీయాలు తాగడానికి ఒకప్పుడు ఎక్కువగా గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు, పింగాణి కప్పులు వంటివి వాడే వారు. కానీ ఈ మధ్య ఎక్కువగా డిస్పోజబుల్ పేపర్ కప్పులను వాడుతున్నారు. ముఖ్యంగా ఇంటికి ఎక్కువమంది బంధువులు వచ్చినప్పుడు, ఫంక్షన్లలో, ఆఫీసుల్లో మళ్లీ మళ్లీ క్లీన్ చేయడం తప్పుతుందనే ఉద్దేశంతో వీటినే వాడుతుంటారు. కానీ ఈ పద్ధతి ప్రమాదకరమని, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్’లో పబ్లిషైన ఒక అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నది. ఇంకా ఏయే ప్రమాదాలు పొంచి ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
ప్లాస్టిక్ ప్రమాదకరమని వాటికి ప్రత్యామ్నాయంగా డిస్పోజబుల్ పేపర్ కప్పులు, ప్లేట్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇవి కూడా ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మన్నికగా ఉండేందుకు వాటిని తయారు చేసేటప్పుడు ‘ప్లాస్టిక్-కోటింగ్’ ఇస్తారు. కాబట్టి ఈ సింగిల్ యూజ్ పేపర్ కప్పుల్లో(single-use paper cups), కాఫీ, ఇతర వేడి ద్రవాలు పోసినప్పుడు 15 నిమిషాల్లోనే 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తాయని అధ్యయనం పేర్కొన్నది.
మైక్రో ప్లాస్టిక్‌తో పాటు కప్పు లోపలి పొర నుంచి హానికరమైన మెటల్స్ అండ్ అయాన్‌లు(metals and ions also leach) కూడా లీచ్ అవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా డిస్పోజబుల్ పేపర్ గ్లాసులు లేదా ప్లేట్లలో తీసుకునే ఆహారం, పానీయాల ద్వారా మైక్రో ప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి ప్రవేశించి, అవయవాలలో పేరుకుపోయి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా రీయూజబుల్ స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు లేదా సిరామిక్ కప్పుల వంటి వాటిని ఉపయోగించడం ద్వారా మైక్రోప్లాస్టిక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని సూచిస్తున్నారు. Link






