- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hair loss : జుట్టు రాలే సమస్యను పెంచుతున్న చక్కెర పానీయాలు, ఆల్కహాల్.. అధ్యయనంలో వెల్లడి
జుట్టు రాలే సమస్యకు ప్రధాన కారణం అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, పానీయాలు, సప్లిమెంట్లేనని పరిశోధకులు గుర్తించారు.

దిశ, ఫీచర్స్ : తరచుగా జుట్టు రాలుతోందా? బట్టతల వస్తోందేమోనని అనుమానం కలుగుతోందా? అయితే మీరు తీసుకునే ఆహారాల్లో, పానీయాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చక్కెర పానీయాలు అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్ సేవించడం ఈ సమస్యకు దారితీస్తుందని పోర్చుగల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్టో ఫ్యాకల్టీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ పరిశధకుల అధ్యయనంలో వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 61,332 మందిని ప్రశ్నించారు. వీరిలో 97% మహిళలు కూడా ఉన్నారు. కాగా వీరు జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, పానీయాలు, సప్లిమెంట్లేనని గుర్తించారు. పరిశోధకుల ప్రకారం.. వారానికి 3,500 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ అధిక చక్కెర కలిగిన పానీయాలు.. ఉదాహరణకు సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్‌లు వంటివి తాగడం జుట్టు రాలడాన్ని పెంచుతున్నాయి. ఎందుకంటే అధిక చక్కెర స్కాల్ప్ మీద అధిక సెబమ్ (నూనె) ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జుట్టు మూలాలు దెబ్బతినడానికి కారణం అవుతుంది.
అలాగే అవసరం ఉన్నా లేకున్నా ఆరోగ్యానికి మంచిదని విటమిన్ డి సప్లిమెంట్లు వాడటం కూడా జుట్టు రాలే సమస్యకు దారితీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతోపాటు ఆల్కహాల్ తరచుగా సేవించడం కూడా జుట్టు రాలడానికి దారితీస్తుండగా ఈ సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటోందని అధ్యయనం పేర్కొన్నది. ఎందుకంటే అధిక చక్కెర కలిగిన పానీయాలు, ముఖ్యంగా మద్యపానం ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను, హార్మోనల్ అసమతుల్యతను పెంచుతాయి. ఇవి జుట్టు ఫాలికల్స్‌కు ఆక్సిజన్ సరఫరాను తగ్గించి, మెలానిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, క్రమంగా బట్టతల రావడం సంభవిస్తాయి. Link






