- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భిణులు జాగ్రత్త! వాయుకాలుష్యం పుట్టబోయే బిడ్డ మెదడును దెబ్బతీస్తుంది!
గర్భిణులు వాయు కాలుష్యానికి గురైనప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ (NO₂), ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5), బ్లాక్ కార్బన్ వంటి కాలుష్యాలు గర్భస్థ శిశువు మెదడు కుహరాల్లో సమతుల్యతను ప్రేరేపిస్తాయి.

దిశ, ఫీచర్స్ : వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులను, ముఖ్యంగా ఆస్తమా రిస్క్‌ను మరింత అధికం చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే దీంతోపాటు ఇతర అనారోగ్యాలకు సైతం దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు గర్భధారణ సమయంలో ఎయిర్ పొల్యూషన్ బారిన పడటం అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడు ఎదుగుదలపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చునని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా రెండు లేదా మూడు నెలల ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ప్రభావం అధికంగా ఉండవచ్చునని తెలిపింది.
బార్సిలోనా లైఫ్ స్టడీ కోహార్ట్ (BiSC project) ఆధారంగా జరిగిన పరిశోధన ప్రకారం.. సుమారు 754 గర్భిణులపై వాయు కాలుష్య ప్రభావాలను పరిశోధకులు స్టడీ చేశారు. మూడవ త్రైమాసికంలో ట్రాన్స్‌వాజినల్ న్యూరోసోనోగ్రఫీ (స్పెషలైజ్డ్ అల్ట్రాసౌండ్) ద్వారా ఫీటల్ బ్రెయిన్ స్ట్రక్చర్‌లను విశ్లేషించారు. వాయు కాలుష్యానికి గురైనప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ (NO₂), ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5), బ్లాక్ కార్బన్ వంటి కాలుష్యాలు మెదడు కుహరాల్లో సమతుల్యత, మోటార్ స్కిల్స్‌తో సంబంధం ఉన్న ప్రాంతాల్లో స్వల్ప తేడాలకు కారణం అవుతుంటాయని గుర్తించారు. ఈ మార్పులే శిశువుల మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రెండవ, మూడవ త్రైమాసికాల్లో కాలుష్యానికి గురైన వారిలో ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. మెదడులోని ద్రవం నిండిన భాగాలు (వెంట్రికల్స్) పెద్దవవుతాయి. అందుకే గర్భిణులు వాయు కాలుష్యం నుంచి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నగరాల్లో కాలుష్యాలను తగ్గించే చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.






