కెరీర్ vs ఫ్యామిలీ.. ఏది ముఖ్యమో తేల్చుకోలేకపోతున్న మహిళలు!

by Javid Pasha |   (  Updated:2026-01-12 08:27:41  IST  )

ఉద్యోగ నిర్వహణ, కుటుంబ బాధ్యతల విషయంలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలనే విషయాన్నితేల్చుకోలేక చాలామంది మహిళలు బాధను వ్యక్తం చేస్తుంటారని ఒక అధ్యయనం పేర్కొన్నది.

కెరీర్ vs ఫ్యామిలీ.. ఏది ముఖ్యమో తేల్చుకోలేకపోతున్న మహిళలు!
X

దిశ, ఫీచర్స్ : తాము ఎప్పుడు ఏం చేయాలి? ఏ ఉద్యోగానికి ట్రై చేయాలి? ఎలాంటి చదువులు చదవాలి? ఏ కెరీర్‌లో ప్రవేశించాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏ విధమైన బట్టలు వేసుకోవాలి? పర్సనల్ బౌండరీస్ ఏంటి? ఇలా ప్రతీ విషయంలో తమకంటూ క్లారిటీని కలిగి ఉంటారు చాలా మంది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలు అనేక విషయాల్లో కాస్త ఎక్కువ స్పష్టతను కలిగి ఉంటారని సైతం నిపుణులు చెబుతుంటారు. కానీ కెరీర్(Career progression) అండ్ ఫ్యామిలీ నిర్వహణలో ఏది ఫస్ట్ ప్రయారిటీ? రెండింటి మధ్య సమతుల్యత ఎలా పాటించాలనే విషయంలో మాత్రం ఆధునిక మహిళలు వెనుకబడుతున్నారని, చాలా మందికి క్లారిటీ ఉండట్లేదని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్(ASA) నుండి వచ్చిన ఒక జనరలైజ్డ్ అధ్యయన డేటా పేర్కొంటున్నది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

భావోద్వేగ ఒత్తిళ్లే కారణమా?

కెరీర్‌లోకి ప్రవేశించక ముందు ఏదో ఒక మంచి ఉద్యోగం చూసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని అనేకమంది మహిళలు భావిస్తుండగా.. ఇక మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత మాత్రం చాలామంది తాము ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలేదనే ఆలోచనతో బాధపడుతుంటారని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మూడవ వంతు( 1/3) మహిళలు కెరీర్ పురోగతిని, కుంటుంబాన్ని ప్రారంభించడానికంటే ముందు ప్రారంభించడాన్ని.. అంటే పెళ్లి, ఆ తర్వాత సంతానం కనడానికంటే ముందుగానే నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంవల్ల నష్టపోతున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విధమైన అస్పష్టత చాలా మందిలో భావోద్వేగ, సామాజిక, జీవశాస్త్రపరమైన ఒత్తిళ్లవల్ల ఏర్పడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. వయస్సు పెరిగే కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుండటం, అలాగే వ్యక్తిగత లక్ష్యాలు మారుతుండటం వంటి సవాళ్లు ఇందుకు కారణం అవుతున్నాయి.

ఆర్థిక భద్రతలేకపోవడం కూడా..!

కెరీర్ అండ్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ విషయంలో మహిళల్లో లోపిస్తున్న అస్పష్టత పెద్ద సమస్య మాత్రం కాదని, ఇది వృత్తిపరమైన విజయాల్లో అసంతృప్తి లేదా వైఫల్యాన్ని సూచించదని కూడా నిపుణులు అంటున్నారు. కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన ఒత్తిళ్ల వల్ల వాటి మధ్య సమతుల్యత లోపించడమే ఈ విధమైన నిరాశకు, అభిప్రాయాల్లో, ఆలోచనల్లో మార్పునలకు కారణం అవుతున్నట్లు చెబుతున్నారు. అంటే వృత్తి జీవితం, కుటుంబ జీవిత వాస్తవాల మధ్య ఉన్న అంతరం వల్ల ఇది ఏర్పడుతుంది. అయితే కొందరు సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని వ్యక్తిగత సమస్య కాదు, వ్యవస్థాగత సమస్యగా అని కూడా అంటున్నారు. కఠినమైన పని వాతావరణం, పిల్లలు, కుటుంబ సంరక్షణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఉద్యోగ,ఆర్థిక భద్రత లేకపోవడం వంటివి కూడా కెరీర్ అండ్ ఫ్యామిలీ నిర్వహణలో క్లారిటీ మిస్ అయ్యేలా చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

Next Story