Health : వృద్ధాప్యం త్వరగా రాకూడదంటే.. వారంలో 5 రోజులు 40 నిమిషాలపాటు ఇలా చేస్తే చాలు..!

by Javid Pasha |

Health : వృద్ధాప్యం త్వరగా రాకూడదంటే.. వారంలో 5 రోజులు 40 నిమిషాలపాటు ఇలా చేస్తే చాలు..!

Health : వృద్ధాప్యం త్వరగా రాకూడదంటే.. వారంలో 5 రోజులు 40 నిమిషాలపాటు ఇలా చేస్తే చాలు..!
X

దిశ, ఫీచర్స్ : యవ్వనంగా కనిపించడానికి కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేసే ఆహారాలను, సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకుంటారు. ముఖంలో ఏజింగ్ లక్షణాలు కనిపించకుండా ఫేషియల్ క్రీములను వాడుతుంటారు. అయితే ఇవేవీ వయసు తెచ్చే మార్పులను పెద్దగా అడ్డుకోలేవు కానీ.. కొన్ని రకాల వ్యాయామాలు మాత్రం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. అలాంటి వాటిలో స్పీడ్ రన్నింగ్(Intense running) కూడా ఒకటి. ఇది వృద్ధాప్యాన్ని 9 ఏండ్లు వెనక్కి నెడుతుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణ వాకింగ్ లేదా రన్నింగ్‌తో పోలిస్తే ఇంటెన్స్ రన్నింగ్ యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుందని బ్రిఘమ్ యంగ్ యూనివర్సిటీ (Brigham Young University)కి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొన్నది. ఎందుకంటే ఇది మానవ డీఎన్ఏ చివరల్లో ఉండే టెలోమీర్లను రక్షించి, కణాలను యవ్వనంగా ఉంచడంలో కీ రోల్ పోషిస్తుంది. తద్వారా వృద్ధాప్యాన్ని 8 నుంచి 9 ఏండ్లు ఆలస్యం చేస్తుంది. అయితే అందుకోసం వారానికి 5 రోజులు 30 నుంచి 40 నిమిషాలు ఎక్కువ శ్రమతో కూడిన స్పీడ్ రన్నింగ్ చేయడం మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీరంలోని కణాలు సహజంగానే క్షీణిస్తుంటాయి. ఈ పరిస్థితి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే తీవ్రమైన వ్యాయామం, ముఖ్యంగా రన్నింగ్ ఈ క్షీణతను ఆలస్యం చేస్తుందని అధ్యయనంలో తేలింది. వారానికి ఐదు రోజులు 30 నుంచి 40 నిమిషాల పాటు రన్నింగ్ చేసిన వ్యక్తుల కణాలు, అలా చేయని వ్యక్తులతో పోలిస్తే దాదాపు 9 సంవత్సరాలు యవ్వనంగా కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రభావం సాధారణ లేదా తేలికపాటి వ్యాయామాల ద్వారా కనిపించలేదని, తీవ్రమైన రన్నింగ్ మాత్రమే ఈ ఫలితాన్ని ఇచ్చిందని తెలిపారు. కాబట్టి ఎక్కువకాలం యవ్వనంగా కనిపించాలంటే.. 40 నిమిషాలు ఇంటెన్స్ రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. Link

Next Story