Lonely life : ఇట్లైతే ఎట్లా బ్రో..! ఏజ్‌ మీద పడుతున్నా పెళ్లిళ్లు కావిక !!

by Javid Pasha |

Lonely life : ఇట్లైతే ఎట్లా బ్రో..! ఏజ్‌ మీద పడుతున్నా పెళ్లిళ్లు కావిక !!

Lonely life : ఇట్లైతే ఎట్లా బ్రో..! ఏజ్‌ మీద పడుతున్నా పెళ్లిళ్లు కావిక !!
X

దిశ, ఫీచర్స్ : ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు ఎనకటికి పెద్దలు. కానీ ఈ రోజుల్లో ఆ రెండవ కల నెరవేరడం కష్టమైపోతోందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేటి పెద్దలు. ఎందుకంటే పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పటికీ పెళ్లిళ్లు అవ్వడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే యువతీ యువకులు పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపడం లేదు. చూద్దాం.. చేద్దాం అంటుండగానే 20 ఏండ్ల వయసు.. కాస్త 40 ఏండ్లలోకి ఎంట్రీ ఇచ్చాక అయ్యో అని ఆవేదన చెందుతున్నవారు కూడా అనేకమంది ఉంటున్నారని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం!

ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరితే మంచిదే కావచ్చునేమో కానీ.. తీర్చుకోలేని పరిస్థితినే 25% యువత ఎందుర్కొంటున్నదని నిపుణులు చెబుతున్నారు. రీసెంట్ డెమోగ్రాఫిక్ అండ్ బిహేవియరల్ స్టడీస్(recent demographic and behavioral studies) కూడా అదే చెబుతున్నాయి. ఈ అధ్యయనాల ప్రకారం సుమారు 25% యువతీ యువకులు(ప్రతీ నలుగురిలో ఒకరు) ఇంకెప్పటికీ పెళ్లిచేసుకోకపోవచ్చు. లేదా దీర్ఘకాలిక సహజీవన సంబంధంలోకి (long-term cohabiting relationship) అసలు అడుగు పెట్టకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పెరుగుతున్న ధోరణలు, మారుతున్న విలువలు, జీవనశైలి ప్రాధాన్యతలు, ఆర్థిక పరిస్థితులలో మార్పులే అందుకు కారణం.

అసలు కారణాలు ఇవే..!

*వ్యక్తిగత అవసరాలు : ఆధునిక సమాజం అంతా డబ్బు, సంపాదన చుట్టే ఎక్కువగా తిరుగుతోంది. ఈ నేపథ్యంలో 18 ఏండ్లు దాటిని యువతీ యువకులంతా పర్సనల్ కెరీర్, సెల్ఫ్ డెవలప్‌మెంట్(Focus on personal career and self-development)‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇది వివాహం లేదా దీర్ఘకాలిక సంబంధాలను ఆలస్యం చేయడానికి లేదా పూర్తిగా తగ్గించడానికి దారితీస్తోంది.

*వైఖరిలో మార్పు : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సమాజం, సంబంధాలు, మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ వంటి విషయాల్లో యువత ఆటిట్యూడ్ మారుతోంది. పెళ్లిళ్ల విషయంలోనూ కంఫర్ట్‌ గురించి ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురు వివాహం లేకుండా ఒంటరిగా జీవించడం లేదా ప్రత్యామ్నాయ జీవనశైలులను ఎంచుకుంటున్నారు. ఇది సొసైటీ ఆమోదయోగ్యంగానూ (It has become socially acceptable) మారింది.

* ఫైనాన్షియల్ రీజన్స్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు.. ప్రేమ, పెళ్లి, జీవితం అన్నీ ఫైనాన్షియల్ పర్పస్ మీద ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే ఆర్థిక స్థిరత్వం లేనిదే పెళ్లి చేసుకోవడం దండగ అనే ధోరణి నేటి యువతలో పెరుగుతోంది. దీంతో అప్పటికే ఆర్థిక అస్థిరత, కుటుంబాలు అప్పటికే ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు(Financial instability and housing affordability challenges) వంటివి యువతను ఆలోచింపజేస్తున్నాయి. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇవి కూడా కీ రోల్ పోషిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి, గృహ ఖర్చులు, ఉపాధి సవాళ్లు వంటివి వివాహం లేదా దీర్ఘకాలిక సంబంధాలను ప్రారంభించడానికి ముఖ్యమైన అవరోధాలుగా మారుతున్నాయి.

*వ్యక్తిగత స్వేచ్ఛ : పెళ్లి చేసుకోకుంటే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే రోజులు పోయాయి. ఎందుకంటే ఒంటరి జీవనానికి, వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, ప్రత్యామ్నాయ జీవనశైలులకు సొసైటీలో మద్దతు, ఆమోదం రెండూ లభిస్తున్నాయి. దీంతో పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది ఫైనల్లీ పూర్తిగా పర్సనల్ ఇంట్రెస్ట్‌పైనే ఆధారపడి ఉంటోంది. కాబట్టి తగిన ఉద్యోగం, సంపాదన, ఆర్థిక స్థిరత్వం లేని యువతీ యువకుల్లో చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. కొందరు చేసుకున్నా ఆర్థిక అనిశ్చితి కారణంగా పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. పెళ్లిళ్ల ఆలస్యానికి లేదా పెళ్లిళ్లు కాకపోవడానికి, అయినప్పటికీ తగ్గుతున్న జననరేట్లకు ఈ దోరణలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అందరూ అలాగే ఆలోచించడం లేదు కానీ.. 25% మంది యువతీ యువకులు మాత్రం ఇది పాటిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటన్నాయి.

Next Story