డిప్రెషన్ రిస్క్‌ను పెంచుతున్న ‘టాక్సిక్ వర్క్‌ప్లేస్‌లు’.. ఆ విషయంలో జాగ్రత్త అంటున్న నిపుణులు

by Javid Pasha |

డిప్రెషన్ రిస్క్‌ను పెంచుతున్న ‘టాక్సిక్ వర్క్‌ప్లేస్‌లు’.. ఆ విషయంలో జాగ్రత్త అంటున్న నిపుణులు

డిప్రెషన్ రిస్క్‌ను పెంచుతున్న ‘టాక్సిక్ వర్క్‌ప్లేస్‌లు’.. ఆ విషయంలో జాగ్రత్త అంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా వర్క్‌ప్లేస్‌లు ఉద్యోగులకు సపోర్టివ్‌గా ఉంటాయి. అలా ఉన్నప్పుడే ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ పెరుగుతాయని కూడా భావిస్తారు. అయితే అన్నిచోట్ల, అన్ని సందర్భాల్లో అలాగే ఉంటుందని కూడా చెప్పలేం. కొన్ని వర్క్‌ప్లేస్‌లలో అక్కడి వ్యక్తులు, పరిస్థితులు, పనితీరును బట్టి టాక్సిక్ వెదర్ (విషపూరిత వాతావరణం) కూడా క్రియేట్ అవుతుంది. కాగా ఇది ఉద్యోగుల్లో డిప్రెషన్ స్థాయిలను పెంచే అవకాశం ఉందని రీసెంట్ అధ్యయనం పేర్కొన్నది.

ముఖ్యంగా ఎక్కువ గంటలు పనిచేసే సమయంలో తక్కువ మద్దతు, అధిక డిమాండ్‌లు(little support and high demands) ఉండటం, దానికితోడు మీకు ప్రతికూలంగా వ్యవహరించే వ్యక్తులు, మీ అభివృద్ధిని చూసి అసూయ చెందేవారు, ఏదోఒక సాకుతో మీపై చాడీలు చెప్పేవారు ఉండటం మానసిక స్థితిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని, ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని 300% పెంచుతుందని, 2,000 మందికి మించి ఉద్యోగులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

‘BMJ ఓపెన్’ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయన వివరాల ప్రకారం టాక్సిక్ వర్క్ ప్లేస్‌లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపుతాయి. ఇక వారంలో 40 గంటలకు మించి పనిచేసే వర్క్‌ప్లేస్‌లలో టాక్సిక్ వెదర్ లేదా టాక్సిక్ కొలీగ్స్ కారణంగా స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ రిస్క్‌లను కూడా ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వారంలో 55 గంటలు దాటిన పనివిధానం కలిగిన టాక్సిక్ వర్క్ ప్లేస్‌లలో ఇది మరింతఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే టాక్సిక్ వెదర్ బాధిత వ్యక్తుల్లో క్రానిక్ స్ట్రెస్, బ్రెయిన్‌లో థ్రెట్ రెస్పాన్స్‌ను యాక్టివేట్ చేస్తుంది, స్ట్రెస్ హార్మోన్‌ల అధిక విడుదలకు, తద్వారా బర్న్ అవుట్ అండ్ డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం పెరుగుతుంది. క్రమంగా మెమరీ, ఎమోషనల్ రెగ్యులేషన్, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే టాక్సిక్ వెదర్‌లో బీ కేర్‌ఫుల్ అంటున్నారు నిపుణులు.

Link

Next Story