జస్ట్ 6 నిమిషాలు ఈ పని చేస్తే.. 68% శాతం తగ్గుతున్న అధిక ఒత్తిడి..!

by Javid Pasha |

జస్ట్ 6 నిమిషాల బుక్ రీడింగ్ హాబిట్ మీలోని ఒత్తిడి స్థాయిలను 68% వరకు తగ్గిస్తుందని ఒక అధ్యయనం పేర్కొన్నది.

జస్ట్ 6 నిమిషాలు ఈ పని చేస్తే.. 68% శాతం తగ్గుతున్న అధిక ఒత్తిడి..!
X

దిశ, ఫీచర్స్ : అధిక ఒత్తిడితో సతమతం అవుతున్నారా ?.. లేనిపోని ఆలోచనలతో మైండ్ బర్న్ అవుతోందా..? ఆందోళనతో గుండె వేగం పెరుగుతోందా ? అయితే డోంట్ వర్రీ.. జస్ట్ ఆరు నిమిషాలు ఈ పనిచేయండి.. ఆ తర్వాత బిగ్ రిలీఫ్ పొందుతారు. మానసిక ఆనందాన్ని పొందడమే కాదు, మొద్దుబారిన మీ మెదడు గేర్ మార్చుకుంటుందని, ప్రమాదకర స్థాయిలో ఉన్న మీ గుండె చప్పుడు ప్రశాంతంగా మారుతుందని ససెక్స్ యూనివర్సిటీకి చెందిన ఒక అధ్యయనం పేర్కొన్నది. ఇంతకీ ఆ పని ఏంటో అనుకుంటన్నారా..? ‘చదవడం.

అవును.. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అందులో రిస్క్ అంతకంటే లేదు. చేయాల్సిందల్లా మీకు నచ్చిన పుస్తకం చదివితే చాలు. ఒత్తిడి చిత్తవుతుందని ససెక్స్ యూనివర్సిటీలో కాగ్నెటివ్ న్యూరో సైకాలజిస్ట్ (Cognitive Neuropsychologist) అయిన డాక్టర్ డేవిడ్ లూయిస్ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. దీని ప్రకారం జస్ట్ 6 నిమిషాల బుక్ రీడింగ్ హాబిట్ మీలోని ఒత్తిడి స్థాయిలను 68% వరకు తగ్గిస్తుంది. ఎందుకంటే చదివే అలవాటు మీలో విజ్ఞనాన్ని, భాషా పరిజ్ఞానాన్ని పెంచడంతోపాటు, మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

అది వచనం, కవిత్వం, నవల, నాన్-ఫిక్షన్ ఇలా ఇంకే రూపంలో ఉన్నా సరే పుస్తకం చదవడమనేది మీలో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కండరాల ఉద్రిక్తతను(Relaxes muscle tension) సడలిస్తుంది. మైండ్‌ను రీసెంట్ చేస్తుంది. అంటే సంగీతం వినడం (61%), టీ తాగడం, (54%), లేదా వాకింగ్ చేయడం (42%) కంటే కూడా ఇది మోస్ట్ ఎఫెక్టివ్‌గా మీ మూడ్‌ను మార్చేస్తుంది. మీలోని ఒత్తిడి, ఆందోళనలను పటా పంచలు చేసేస్తుంది. ఇంకెందుకాలస్యం.. మీకు నచ్చిన పుస్తకమేదో వెతుక్కోండి!

Next Story