- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్ : ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీటిలో ఏదో ఒకటి తాగనిదే ఏమీ తోచదని కూడా కొందరు చెబుతుంటారు. అయితే ఇందులో కాఫీ మెదడుకు సంబంధించిన పలు ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుందని న్యూట్రియెంట్స్ జర్నల్, జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాఫీలోని ఔషధ గుణాలు మెదడు వృద్ధాప్యాన్ని నెమ్మదింప జేస్తాయని చెబుతున్నాయి. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.
*రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగే వ్యక్తుల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పైగా వృద్ధాప్యం నెమ్మదించడంవల్ల జ్ఞాపక శక్తి పదునుగా ఉంటుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
* కాఫీలోని కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయి. మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తాయి. మెదడు కణాలు(న్యూరాన్లు) దెబ్బతినకుండా కాపాడతాయి.
*అధ్యయనాల ప్రకారం రోజూ రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగే వృద్ధులు, కాఫీ తాగని వారితో పోలిస్తే, మెదడు పనితీరు పరీక్షలలో మెరుగైన ఫలితాలను చూపించారు. దీర్ఘకాలిక పరిశోధనలు కూడా కాఫీ మితంగా తాగడం డిప్రెషన్ రేట్లను తగ్గించగలదని, మెదడు వృద్ధాప్యాన్ని అడ్డుకోవడం ద్వారా మొత్తం ఆయుష్షును పెంచుతుందని సూచిస్తున్నాయి.
*రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడం ద్వారా కాఫీ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా కెఫీన్ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా అధిక బరువును నియంత్రిస్తుంది.
* జాగ్రత్తలు: అయితే కాఫీ అతిగా, అంటే రోజుకు 3 కప్పులకు మించి తీసుకోవడం మాత్రం మంచిది కాదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా తీసుకుంటే ఆందోళన (anxiety), నిద్రలేమి ( insomnia), గుండెపై ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు. కానీ ఒకటి లేదా రెండు కప్పులు తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.






