Health : పిల్లల్లో అతి ప్రవర్తన (ADHD).. మెగ్నీషియం లోపమే 95% కారణమంటున్న నిపుణులు

by Javid Pasha |   (  Updated:2025-06-28 13:31:22  IST  )

Health : పిల్లల్లో అతి ప్రవర్తన (ADHD).. మెగ్నీషియం లోపమే 95% కారణమంటున్న నిపుణులు

Health : పిల్లల్లో అతి ప్రవర్తన (ADHD).. మెగ్నీషియం లోపమే 95% కారణమంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. కానీ ఓవర్ యాక్టివ్‌నెస్ పెరిగిపోతే, కంట్రోల్ చేయడం కష్టంగా అనిపిస్తే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే అది పిల్లల్లో అతి చురుకుదనం, అతి ప్రవర్తనకు దారితీసే ఏడీహెచ్‌డీ(Attention-Deficit/Hyperactivity Disorder) లక్షణాలు కావచ్చు. ఇది హైపరాక్టివిటీకి దారితీసే ఒక రకమైన రుగ్మతగా నిపుణులు పేర్కొంటున్నారు. 3 నుంచి 12 ఏండ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అతిగా మాట్లాడటం, అతిగా స్పందించడం, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, దూకుడుగా వ్యవహరించడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఓపిక, సహనం లేకపోవడం వంటి లక్షణాలు ఇందులో భాగమే. అయితే చాలా వరకు మెగ్నీషియం లోపించడంవల్లే ఇది సంభవిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

పిల్లల్లో అతి ప్రవర్తనకు దారితీసే కారణాలపై 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు అధ్యయన నివేదికలు (Kozielec & Starobrat-Hermelin)సైతం ఏడీహెచ్‌డీ ఉన్న 95% మంది పిల్లల జుట్టులో మెగ్నీషియం లోపం ఉన్నట్లు గుర్తించాయి. ఇది సర్వ సాధారణ సమస్య అని కూడా పేర్కొన్నాయి. దీంతోపాటు హైపారాక్టివిటీ కలిగిన పిల్లల్లో 58% మందికి ఎర్ర రక్త కణాలలో మెగ్నీషియం, 33% మందిలో సీరం మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటున్నాయి. దీనివల్లే పిల్లలు హైపరాక్టివ్‌గా ప్రవర్తిస్తారని అధ్యయనాలను విశ్లేషించిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెగ్నీషియం లోపం పిల్లల్లో న్యూరో ట్రాన్స్‌మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆరోగ్యానికి, మానసిక సమతుల్యతకు దోహదం చేసే డోపమైన్, సెరోటోనిన్, గ్లూటమేట్ వంటి హార్మోన్లు రిలీజ్ కాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పిల్లల్లో మెగ్నీషియం లోపం లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

లక్షణాలు

ఏ విషయంలోనూ సరైన శ్రద్ధ లేకపోవడం (Attention deficit), హైపరాక్టివిటీ లేదా అతి ప్రవర్తనను కలిగి ఉండటం, అతిగా స్పందించడం, అతిగా మాట్లాడటం, పనులపై, చదువుపై దృష్టి కేంద్రీకరించకపోవడం ఏడీహెచ్‌డీ(అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్) లక్షణాలుగా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా తరచుగా పొరపాట్లు చేయడం, కాళ్లు, చేతులు అతిగా కదిలించడం, సందర్భోచితం కాని ప్రవర్తన, హోం వర్క్, ఇతర పనులను మరచిపోవడం, ఆసక్తి కోల్పోవడం, వస్తువులు తరచుగా పోగొట్టుకోవడం వంటివన్నీ పిల్లల్లో పునరావృతమవుతూ ఉంటాయి. ప్రధానంగా మెగ్నీషియం లోపమే ఇటువంటి మానసిక స్థితికి, ప్రవర్తనకు కారణం అవుతుంది.

పరిష్కారం లేదా నివారణ

సాధారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలి. మెగ్నీషియం లోపాన్ని తగ్గించే ఆహారాలు తప్పక చేర్చాలి. ఆకు కూరలు (పాలకూర, కాలే), గింజలు (బాదం, కాజు, గుమ్మడికాయ గింజలు), తృణధాన్యాలు (ఓట్స్, బ్రౌన్ రైస్), బీన్స్ (బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్), అవకాడో, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్ (70% కోకో లేదా అంతకంటే ఎక్కువ), గోధమలు, చేపలు వంటివి మెగ్నీషియం అందించే సహజ ఆహార వనరులు. పిల్లల రోజువారీ ఆహారంలో ఇవి చేర్చడం వల్ల ఏడీహెచ్‌డీని నివారిస్తాయి. ప్రస్తుతం మెగ్నీషియం సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. పిల్లల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలి. సైకియాట్రిస్టులు తగిన చికిత్స అందిస్తారు.

LINK

Next Story