ఎవరూ చెప్పకపోయినా సరే.. కూతురు బాధలో, ఆపదలో ఉంటే తల్లికి తెలిసిపోతుంది..! ఎలా సాధ్యం?

by Javid Pasha |

ఎవరూ చెప్పకపోయినా సరే.. కూతురు బాధలో, ఆపదలో ఉంటే తల్లికి తెలిసిపోతుంది..! ఎలా సాధ్యం?
X

దిశ, ఫీచర్స్ : చదువు కోసమో, జాబ్ కోసమో కూతురు సిటీలో ఉంటుంది. పేరెంట్స్ ఊర్లో ఉంటారు. ఒకానొక రోజు కూతురుకి అనుకోకుండా జ్వరం వస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే.. ‘అమ్మ దగ్గరుంటే బాగుండు.. వేడి వేడిగా ఏదైనా చేసి పెట్టేది. ఫీవర్ త్వరగా తగ్గేది’ అని మనసులో అనుకుంటుండగానో, అనుకున్న కాసేపటికో కూతురు ఫోన్ మోగుతుంది. ఎవరో కాదు.. అవతలి నుంచి ‘అమ్మ కాలింగ్’. రిసీవ్ చేయగానే.. మరో మాట మాట్లాడకుండా ‘ఎట్లున్నవ్ బిడ్డా.. బాగానే ఉన్నవా?!’.. ఏదో ఆత్రుత, ఆందోళతో కూడిన గద్గద స్వరంతో అమ్మ పలకరిస్తుంది. అదేంటి..? నాకు జ్వరం వచ్చిన సంగతి అమ్మకు ఎవరైనా చెప్పారా? అని ఇక్కడ కూతురుకి కూడా డౌట్ వస్తుంది. కానీ ఎవరూ చెప్పి ఉండరు.

అమ్మకు అర్థమై పోతుంది

యెస్.. కూతురికి జ్వరమే వచ్చిందని కచ్చితంగా తెలియకపోయినా.. తన బిడ్డ ఏదో బాధలో, ఆపదో ఉందన్న సంగతి మాత్రం అమ్మకు తెలిసిపోతుంది. అందుకే ఆత్రుతగా ఫోన్ చేసి ఆరా తీస్తుంది. ఇలాంటి అనుభవం దాదాపు ప్రతీ కూతురు తన జీవితంలో ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటుంది. దీనినే కొందరు నిపుణులు టెలిపతి(Mind-to-mind conversation)గా పేర్కొంటుండగా.. శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు మాత్రం ఇది జన్యుపరమైన లింక్, షేర్డ్ ఎక్స్‌పీరియన్సెస్, అతి సున్నితమైన భావోద్వేగ గ్రహణశక్తి (voice tone, facial expressions, body language వంటి సూక్ష్మ సూచనలు) కలయిక వల్ల వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

గుర్తు చేసకుంటే చాలు..

సాధారణంగా తన బిడ్డకు జ్వరం వచ్చినప్పుడో, మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నప్పుడో, అమ్మ ఉంటే బాగుండు అని ఆమె గుర్తు చేసుకున్నప్పుడో మాత్రమే తల్లి నుంచి ఫోన్ రావడం లేదా తల్లి ప్రత్యక్షంగానే కూతురు వద్దకు రావడం వంటి అనుభవం దాదాపు చాలా మంది కూతుళ్లకు ఎదురవుతూ ఉంటుంది. ఇక తనకు పీడ కల వచ్చిందనో, మనసులో ఏదో లాగా ఉందనో, అనుమానమో, అపశకునమో వెంటాడుతుందనో చెప్తూ కూతురు యోగ క్షేమాలను ఆరా తీస్తుంది తల్లి. ఇంతకీ ఎందుకిలా జరుగుతుందంటే.. జన్యుపరమైన లింక్ (Genetics), డీఎన్‌ఏలో ఉమ్మడి జన్యువుల వల్ల కూడా ఇటువంటి ఎమోషనల్ సెన్సిటివిటీ (Emotional sensitivity) పెరుగుతందని నిపుణులు అంటున్నారు.

70% మంది అనుభవం ఇదే..

కూతురు బాధలో ఉన్నది తల్లికెలా అర్థమై ఉంటుందనే సందేహం కొందరికి కలుగుతూ ఉంటుంది. ‘Journal of Family Psychology, Emotional Intelligence Research’ పేరుతో జరిగిన సర్వేలు, అధ్యయనాల ప్రకారం కూడా 70% మంది మహిళలు తమకు ఈ అనుభవం ఎదురైందని చెప్పారు. ఉదా: ఒక సర్వేలో 85% మంది తల్లులు తమ కూతుళ్లు బాధపడుతున్నప్పుడు ఆటోమాటిక్‌గా ‘గుండెలో బరువుగా’ అనిపించిందని పేర్కొన్నారు. అలాగే అమ్మమ్మలు మనవరాళ్ల ఆరోగ్య సమస్యలను ముందే గుర్తించారు. ఇది సాధారణంగా తల్లి, కూతురు, అమ్మమ్మల మధ్య ఎక్కువగా జరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తరచుగా భావాలు పంచుకోవడం, ఒకే కుటుంబంలో పెరిగిన అనుభవాలు కూడా మనుషుల మధ్య మనసుల ఈ విధమైన బంధాన్ని బలోపేతం చేయడం ద్వారా మెదడులోని న్యూరాన్స్ ఒకరి భావాలను, పరిస్థితిని మరొకరు మనసు ద్వారా గ్రహించేలా, అర్థం చేసుకునేలా స్పందించడంలో ప్రాక్టీస్ అవుతాయి. Link


Next Story