స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్.. ఇది కాంప్లిమెంట్ కాదు ఒక ట్రాప్.. ఎలాగంటే..

by Sujitha Rachapalli |   (  Updated:2026-02-22 15:51:27  IST  )

స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్‌గా కాంప్లిమెంట్స్ అందుకోవడం ఆనందంగానే ఉంటుంది. కానీ రాను రాను ఆ ప్రశంసలను నిలుపుకునేందుకు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్.. ఇది కాంప్లిమెంట్ కాదు ఒక ట్రాప్.. ఎలాగంటే..
X

దిశ, ఫీచర్స్ : స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్.. అనేది గొప్ప కాంప్లిమెంట్. కానీ రాను రాను ఇదొక ట్రాప్‌లా మారిపోతుంది. ఆ ఉచ్చులో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటుంది. బాధ్యతల భారాలను మోయలేకపోయినా మోయిస్తుంది. భుజాలు బరువెక్కినా దించకూడదంటుంది. ఆ చట్రం నుంచి బయటకొస్తే పరువు పోతుందని హెచ్చరిస్తుంది. కానీ నిజంగా స్ట్రాంగ్ అంటే ఏమిటి? అన్నీ ఒక్కరే మోయడమా.. పంచుకుని పరిష్కరించుకోవడమా?

ఎంపవర్మెంట్ కాదు ఎక్స్‌పెక్టేషన్

స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంటే.. కాన్ఫిడెన్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఎమోషనల్ కంట్రోల్ కలిగి ఉండటం. ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం అన్నమాట. ఈ వర్డ్ వినేందుకు పవర్ ఫుల్‌గా, మోడ్రన్‌గా అనిపించొచ్చు. కానీ చాలా మందికి ఈ పదం ఒత్తిడిని ఇస్తుంది. ఎంపవర్మెంట్ కాస్తా ఎక్స్‌పెక్టేషన్‌గా మారడంతో తట్టుకోలేని తలనొప్పిని తెస్తుంది. ముందుగా స్ట్రాంగ్ అనేది వాలిడేటింగ్‌గా అనిపిస్తుంది. మీ ఆర్థిక ఒత్తిళ్లను ఒంటరిగా మీరే చక్కదిద్దగలరు.. సొంత నిర్ణయాలు తీసుకోగలరు.. ఇందుకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఈ ఇమేజ్ కష్టంగా మారిపోతుంది. మీ చుట్టుపక్కన ఉన్నవాళ్లు మీరు హెల్ప్ లేకుండానే అన్నీ మేనేజ్ చేయగలరని అనుకుంటారు. ఒకవేళ అలా చేయడంలో మీరు స్ట్రగుల్ అవుతుంటే.. వాళ్లకు వింతగా అనిపిస్తుంది.

సాయం కోరేందుకు మనసొప్పదు

ఇండిపెండెంట్‌గా ఉండటం ఇంపార్టెంటే. కానీ కాలం ఒకేలా ఉండదు. సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో హెల్ప్ తీసుకోవడం వీక్‌నెస్‌గా అనిపించొచ్చు. అందుకే చాలా మంది స్త్రీలు కెరీర్, రిలేషన్‌షిప్, ఫ్రెండ్షిప్‌లో కూడా సహాయం కోరేందుకు వెనుకాముందు ఆలోచిస్తారు. తమను తాము బలహీనంగా చూపించుకోవడాన్ని ఇష్టపడరు. ఇతరులపై ఆధారపడటం ఎందుకులే అనే ఈ పరిస్థితి ఎమోషనల్‌గా ఒంటరిగా చేస్తుంది. మీరు మోయగలిగే బాధ్యతల, భావోద్వేగాల భారం కన్నా ఎక్కువగా మోసేందుకు కారణమవుతుంది. విశ్రాంతి లేకుండా తీసుకునే బాధ్యతలు బర్నవుట్‌కు దారితీస్తాయి. కానీ స్ట్రాంగ్ అంటే కామ్, రెస్పాన్సిబుల్, అడ్జస్టబుల్‌గానే మిమ్మల్ని మీరు చూపించుకోవాలా? జనాలతో బాధను పంచుకునే స్వాతంత్ర్యం మీకు లేదా?

రీడిఫైనింగ్ స్ట్రెంత్

స్ట్రెంత్ అనేది ఎవరి సహాయం లేకుండా, ఒంటరిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించడం కాదు. ఎప్పుడు ఒంటరిగా నిలబడాలో.. ఎప్పుడు వేరే వాళ్లను మీతోపాటు నిలబడేలా చేయాలో తెలుసుకోవడమే. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఎప్పుడు ఏడ్వకుండా.. ఎవ్వరిని ఏం అడగకుండా ఉండటం కాదు. సిచ్యుయేషన్‌ను బట్టి డిపెండింగ్‌‌గా కూడా మారొచ్చు.

Next Story