- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mental stress : ఒత్తిడీ ఒకింత మంచిదేనట..! ఏ విధంగా అంటే..!
Mental stress : ఒత్తిడీ ఒకింత మంచిదేనట..! ఏ విధంగా అంటే..!

దిశ, ఫీచర్స్ : ఒత్తిడి మిమ్మల్ని చిత్తు చేస్తుంది. మానసిక, శారీరక అనారోగ్యాలకు గురిచేస్తుంది. అందుకే స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇది అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో వర్తించదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒత్తిడిలోనూ మంచీ చెడూ ఉన్నాయని, మంచి ఒత్తిడి మనుషులకు అవసరమని, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అదెలాగో చూద్దామా!
గుడ్ స్ట్రెస్ కూడా ఉంటుంది!
సాధారణంగానే ఒత్తిడికి గురికావడమనేది అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది. పైగా యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శారీరక అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు. కానీ ఇదంతా కేవలం బ్యాడ్ స్ట్రెస్ (Bad stress) వల్ల మాత్రమే జరుగుతుందంటున్నారు నిపుణులు. మంచి ఒత్తిడి (Good pressure) మాత్రం మంచిదేనట.
అలర్ట్ అయ్యేందుకు దోహదం
మానసిక నిపుణుల ప్రకారం మంచి ఒత్తిడి (Good pressure or stress) మనిషికి మేలు చేస్తుంది. అలర్ట్ నెస్ పెంచుతుంది. దీనిని యూస్ట్రెస్(Eustress) అని కూడా పిలుస్తారు. క్యూరియాసిటీకి లోనైనప్పుడు, అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాలు, ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు కూడా మనం ఒత్తిడికి గురవుతుంటాం. కానీ ఈ ఒత్తిడి మనకు హాని చేయదు. పైగా శరీరంలో ఆపద నుంచి బయటపడే కెమికల్ రియాక్షన్స్‌ను ప్రేరేపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే గనుక లేకపోతే వివిధ సందర్భాల్లో నష్టపోతాం.
ఆపద నుంచి బయట పడేందుకు
నిజానికి మంచి ఒత్తిడి(Good stress) మనలో ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ రియాక్షన్(Fight and flight mode reaction)ను ప్రేరేపించడం ద్వారా ఇబ్బందుల నుంచి బయడపడేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవుతారు. కానీ అది వాళ్లు ఇంకా బాగా చదువుకునేలా ప్రేరేపిస్తుందే తప్ప, అనారోగ్యాన్ని కాదు. అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా పరోక్షంగా కారణం అవుతుంది.
బెటర్‌గా తీర్చిదిద్దుతుంది
వర్క్‌ప్లేస్‌లో కూడా కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. అయితే అది గుడ్ ప్రెజరా.. బ్యాడ్ ప్రెజరా అనే దానిని బట్టి మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు కొత్త ప్రాజెక్టును ఒప్పుకోవడం, వర్క్ పూర్తి చేయడం, పనిలో కొత్త మార్పులు వంటివి కొత్త నైపుణ్యాల(New skills)ను నేర్చుకునేలా ప్రేరేపిస్తాయి. మానసిక సంతృప్తికి కారణం అవుతాయి. మనలో టాలెంట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు రొటీన్‌గా వ్యవహరిస్తుంటాం. అలాంటప్పుడు గుడ్ ప్రెజర్(Good pressure)మనల్ని బెటర్‌గా తీర్చిదిద్దుతుంది అంటున్నారు నిపుణులు. దీంతో కొత్త విషయాలను స్టడీ చేయడం, స్కిల్స్ అలవర్చుకోవడం వంటివి చేస్తాం.
ప్రొడక్టివిటీని పెంచుతుంది
పొద్దున్న లేవడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడం, వంట చేయడం వంటివి కూడా మొదట బద్దకంగానే అనిపింటాయి. కానీ అవి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. పేరెంట్స్ పిల్లలను నిద్రలేపడం, వారికి వివిధ పనులు చెప్పడం వంటివి ఒత్తిడిలా అనిపించవచ్చు. కానీ ఒత్తిడి వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ గుడ్ ప్రెజర్(Good pressure)లో భాగమే. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారడంలో, వర్క్ పరంగా ప్రొడక్టివిటీని పెంచడంలో, మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కల్పించడంలో గుడ్ ప్రెజర్ అందరికీ సహాయపడుతుంది. అందుకే ప్రతీది ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు.






