- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : నిద్రను దూరం చేస్తున్న ఒత్తిడి, ఆందోళన.. మహిళల్లోనే అధికం!
తక్కువ నిద్ర వల్ల ఒత్తిడి, కోపం, మానసిక అలసట వంటివి సహజంగానే పెరుగుతాయి. డిప్రెషన్, యాంగ్జైటీలకు దారితీస్తాయి.

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసో లేదో కానీ.. అనేక అనారోగ్యాలు నిద్రలేమితో ముడిపడి ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కంటి నిండా కునుకులేకపోతే వృద్ధాప్యం కూడా త్వరగా సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుండగా.. వీరిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అసలు ఈ సమస్యకు కారణం ఏమిటి? బయట పడాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
74% సమస్యకు కారణం ఇదే..
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సర్వే ప్రకారం.. నిద్రలేమికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళనలే. ముఖ్యంగా స్త్రీలు యావరేజ్‌గా రాత్రిపూట 2 నుంచి 4 గంటల నిద్రను ఓవర్ థింకింగ్ వల్ల కోల్పోతున్నారు. పురుషులు 3 నుంచి 4 గంటలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి స్ట్రెస్, యాంగ్జైటీస్‌ని మరింత పెంచుతున్నది. ఇక పురుషులతో పోలిస్తే 74% మంది మహిళలు ఒత్తిడి వల్ల, 68% మంది ఆందోళన వల్ల నిద్రను కోల్పోతున్నారు. స్త్రీలు పురుషుల కంటే రెండింతలు ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నారు. క్రమంగా ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాగా స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఇది ఇన్‌సామ్నియా (Insomnia)కు దారితీస్తున్నది. ఇక గాలప్ పోల్ ప్రకారం కూడా 18-49 సంవత్సరాల మహిళలు పురుషుల కంటే 53% ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తూ, తక్కువ నిద్రను పొందుతున్నారు.
పరిష్కారం ఏమిటి?
ఒత్తిడి, ఆందోళన, ఓవర్ థింకింగ్ వంటివి స్త్రీ, పురుషుల్లో హార్మోనల్ మార్పులకు(Menstruation, menopause), నిద్రలేమికి దారితీస్తున్నాయి. ఇక తక్కువ నిద్ర వల్ల ఒత్తిడి, కోపం, మానసిక అలసట సహజంగానే పెరుగుతున్నాయి. ఇవి డిప్రెషన్, యాంగ్జైటీలకు దారితీస్తున్నాయి. నిద్ర లోపం వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్ దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుందని, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, డయాబెటిస్ వంటి హెల్త్ రిస్క్ పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఒత్తిడి రహిత జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. కనీసం 6 గంటలకు మించిన క్వాలిటీ స్లీప్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒత్తిడి, ఆందోళనలు వేధిస్తుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు పాటించాలని సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






